• Home/
  • /
  • కొత్త జిల్లాల్లో రిజర్వేషన్ రోస్టర్ పాయింట్ ఒకటి నుంచి ప్రారంభం*

కొత్త జిల్లాల్లో రిజర్వేషన్ రోస్టర్ పాయింట్ ఒకటి నుంచి ప్రారంభం*

 **కొత్త జిల్లాల్లో రిజర్వేషన్ రోస్టర్ పాయింట్ ఒకటి నుంచి ప్రారంభం**

రాష్ట్రంలో రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 అమల్లోకి వచ్చినందున లోకల్ క్యాడర్ల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా ఉద్యోగాల భర్తీ, పదోన్నతులు, రోస్టర్ పాయింట్ల నిర్వహణ, క్యారీ ఫార్వర్డ్ ఖాళీల కేటాయింపుపై సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముసాయిదా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై ఆగస్టు మూడో తేదీ సాయంత్రం 5 గంటల లోపు కార్యదర్శులు, శాఖాధిపతులు తమ సలహాలు, సూచనలు, సవరణలను సూచించాలని కోరింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జిల్లా, జోన్లు, మల్టీ జోన్లు ప్రత్యేక యూనిట్లుగా ఉంటాయి. నియామకాలు, సీనియారిటీ, పదోన్నతులు, బదిలీలకు ఇవే ప్రాతిపదిక.
 
▪️ నేరుగా భర్తీ చేసే జిల్లా, జోన్, మల్టీ జోనల్ స్థాయి ఉద్యోగాల్లో 95% పోస్టులను స్థానిక అభ్యర్థులతో భర్తీ చేస్తారు.
▪️సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, పాత జిల్లాలు, జోన్లలో పాత రోస్టర్ పాయింట్ల నుంచే నియామకాలు కొనసాగుతాయి.
▪️ నూతనంగా ఏర్పడిన జిల్లాలు, కొత్త జోన్లు, మల్టీ జోన్లలో రోస్టర్ పాయింట్ ఒకటి నుంచి కొత్తగా ప్రారంభమవుతుంది.
▪️మిగిలిన క్యారీ ఫార్వర్డ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఖాళీలను నూతనంగా ఏర్పడిన లోకల్ క్యాడర్ల మంజూరు పోస్టుల నిష్పత్తికి అనుగుణంగా పంపిణీ చేస్తారు. కొత్త, పాత జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల మధ్య పంపిణీ చేస్తారు.