• Home/
  • /
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష పత్రికా ప్రకటన (22.07.2026) మెగా పీటీఎం 3.1 నిర్వహణకు రూ. 9.98 కోట్లు నిధులు విడుదల • సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీ బి. శ్రీనివాసరావు IAS గారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష పత్రికా ప్రకటన (22.07.2026) మెగా పీటీఎం 3.1 నిర్వహణకు రూ. 9.98 కోట్లు నిధులు విడుదల • సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీ బి. శ్రీనివాసరావు IAS గారు

 *💥ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం*

*సమగ్ర శిక్ష*
పత్రికా ప్రకటన (22.07.2026)
 
*మెగా పీటీఎం 3.1 నిర్వహణకు రూ. 9.98 కోట్లు నిధులు విడుదల*
సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీ బి. శ్రీనివాసరావు IAS గారు
 
రాష్ట్రంలోని పాఠశాలల్లో ఈ నెల 24న జరగనున్న ‘‘మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (MPTM 3.1)’’ నిర్వహణ కోసం రూ. 9.98 కోట్ల బడ్జెట్‌ను విడుదల చేసినట్లు స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ బి. శ్రీనివాసరావు, IAS గారు తెలిపారు. ఈ నిధులను బుధవారం సమగ్ర శిక్ష జిల్లాల అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ల (APC) ఖాతాలకు జమ చేశామని తెలిపారు. సమగ్ర శిక్ష జిల్లాల అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు ఆ నిధులను బుధవారం సాయంత్రం 4 గంటల లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ సంబంధిత పాఠశాలల ఖాతాలకు బదిలీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిధుల విడుదలలో ఎలాంటి ఆలస్యం వహించరాదని హెచ్చరించారు. అధికారులు, ప్రధానోపాధ్యాయులు మెగా పీటీఎం నిర్వహణ ప్రణాళిక ప్రకారం అమలు చేయాలని కోరారు.
 
*రాష్ట్ర పథక సంచాలకులు* (వారి తరఫున)
సమగ్ర శిక్ష, ఆంధ్రప్రదేశ్.