• Home/
  • /
  • ప్రభుత్వ ఉద్యోగులు ఇతరుల బ్యాంకు రుణాలకు లేదా చిట్ ఫండ్స్ వంటి వాటికి షూరిటీ (Guarantor) సంతకం పెట్టినప్పుడు,లోన్ తీసుకున్న వ్యక్తి రుణం చెల్లించక,డబ్బులు ఎగ్గొడితే ఎదుర్కోవాల్సిన చట్టపరమైన మరియు శాఖాపరమైన (Departmental) చర్యల పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ప్రభుత్వ ఉద్యోగులు ఇతరుల బ్యాంకు రుణాలకు లేదా చిట్ ఫండ్స్ వంటి వాటికి షూరిటీ (Guarantor) సంతకం పెట్టినప్పుడు,లోన్ తీసుకున్న వ్యక్తి రుణం చెల్లించక,డబ్బులు ఎగ్గొడితే ఎదుర్కోవాల్సిన చట్టపరమైన మరియు శాఖాపరమైన (Departmental) చర్యల పూర్తి వివరాలు తెలుసుకుందాం.

 ప్రభుత్వ ఉద్యోగులు ఇతరుల బ్యాంకు రుణాలకు లేదా చిట్ ఫండ్స్ వంటి వాటికి షూరిటీ (Guarantor) సంతకం పెట్టినప్పుడు,లోన్ తీసుకున్న వ్యక్తి రుణం చెల్లించక,డబ్బులు ఎగ్గొడితే ఎదుర్కోవాల్సిన చట్టపరమైన మరియు శాఖాపరమైన (Departmental) చర్యల పూర్తి వివరాలు తెలుసుకుందాం...:

 
➡️ 1).సమాన బాధ్యత చట్టం (Joint and Several Liability)
 
 
➡️ భారతీయ కాంట్రాక్ట్ చట్టం, 1872 (Indian Contract Act, 1872) ప్రకారం, ఒక లోన్‌కు షూరిటీగా సంతకం చేసిన వ్యక్తి, లోన్ తీసుకున్న వ్యక్తితో సమానంగా బాధ్యుడవుతాడు.
 
 
➡️ లోన్ తీసుకున్న వ్యక్తి (Primary Borrower) డిఫాల్ట్ అయితే, బ్యాంకు ముందుగా వాడిపైనే చర్యలు తీసుకోవాలనే రూల్ లేదు.
 
 
➡️ చట్టప్రకారం బ్యాంకు నేరుగా షూరిటీ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు ను బాకీ కట్టమని డిమాండ్ చేయవచ్చు
 
 
➡️ 2).జీతం జప్తు మరియు అటాచ్‌మెంట్ (Salary Attachment)
 
 
➡️ సివిల్ ప్రొసీజర్ కోడ్ (CPC) సెక్షన్ 60 ప్రకారం, కోర్టు ఆర్డర్ లేదా బ్యాంకు రికవరీ నోటీసు ద్వారా ప్రభుత్వ ఉద్యోగి జీతాన్ని నేరుగా అటాచ్ చేసే అధికారం బ్యాంకులకు ఉంటుంది.
 
 
➡️ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ (DDO) : బ్యాంకు అధికారులు కోర్టు ఉత్తర్వులతో మీ పాఠశాల DDOను సంప్రదిస్తారు.
 
 
➡️ డైరెక్ట్ కటింగ్ : చట్టప్రకారం మీ నెలవారీ జీతం నుండి ఒక నిర్ణీత మొత్తాన్ని (జీతంలో నిర్దేశిత మినహాయింపుల పరిమితికి లోబడి) నేరుగా బ్యాంకు రికవరీ ఖాతాకు జమ చేయాల్సిందిగా DDOను కోర్టు ఆదేశిస్తుంది. దీనివల్ల మీ అనుమతి లేకపోయినా మీ జీతం కట్ అవుతుంది
 
 
➡️ 3).ఆస్తుల జప్తు మరియు వేలం (Property Attachment - SARFAESI Act)
 
 
➡️ ఒకవేళ రికవరీ చేయాల్సిన మొత్తం చాలా పెద్దదైతే మరియు జీతం కటింగ్ సరిపోకపోతే, బ్యాంకులు SARFAESI చట్టం కింద చర్యలు తీసుకుంటాయి.
 
 
➡️ షూరిటీ ఇచ్చే సమయంలో మీరు మీ సొంత ఇల్లు లేదా స్థలానికి సంబంధించిన పత్రాలు సమర్పించి ఉంటే, బ్యాంకు ఆ ఆస్తిని జప్తు చేస్తుంది.
 
 
➡️ ఆ తర్వాత పబ్లిక్ నోటీసు జారీ చేసి, మీ ఆస్తిని వేలం వేసి బ్యాంకు బాకీని వసూలు చేసుకునే పూర్తి చట్టపరమైన హక్కు బ్యాంకుకు ఉంటుంది
 
 
➡️ 4).సిబిల్ (CIBIL) లో 'డిఫాల్టర్' ముద్ర
 
 
➡️ లోన్ తీసుకున్న వ్యక్తి కట్టకపోతే, ఆ నెగెటివ్ ఇంపాక్ట్ షూరిటీ ఇచ్చిన ఉపాధ్యాయుడి సిబిల్ రిపోర్ట్‌పై పడుతుంది.
 
 
➡️ మిమ్మల్ని కూడా బ్యాంకు 'విల్‌ఫుల్ డిఫాల్టర్' (WIllful Defaultor) గా లేదా నాన్-పెర్ఫార్మింగ్ అసెట్ (NPA) ఖాతాదారుడిగా ప్రకటిస్తుంది.
 
 
➡️ దీనివల్ల భవిష్యత్తులో మీ సొంత అవసరాలకు (ఉదాహరణకు: హోమ్ లోన్, పర్సనల్ లోన్, పిల్లల ఎడ్యుకేషన్ లోన్) ఎలాంటి లోన్లు రావు
 
 
➡️ 5).ప్రభుత్వ ఉద్యోగ నియమావళి (CCA Rules) కింద శాఖాపరమైన చర్యలు 
 
 
➡️ ప్రభుత్వ సివిల్ సర్వీసెస్ (CCA) నిబంధనల ప్రకారం, ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండాలి.
 
 
➡️  కోర్టు అటాచ్‌మెంట్లు వస్తే : మీ జీతం పదే పదే కోర్టు ఆర్డర్ల ద్వారా అటాచ్ అవుతుంటే, దానిని తీవ్రమైన ఆర్థిక అసమర్థతగా (Financial Embarrassment) పరిగణిస్తారు.
 
 
➡️ చార్జ్ మెమోలు : దీనివల్ల ఉన్నతాధికారుల నుండి మెమోలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మీ ప్రమోషన్లపై లేదా సర్వీస్ రికార్డుపై నెగెటివ్ ఇంపాక్ట్ చూపే ప్రమాదం ఉంది
 
 
➡️ 6).ఐపీ (Insolvency Petition) వేసినా తప్పించుకోలేరు
 
 
▶️ లోన్ తీసుకున్న వ్యక్తి తను అప్పులు కట్టలేనని కోర్టులో ఐపీ (దివాళా పిటిషన్) వేస్తే, కోర్టు వాడిని వదిలేయవచ్చు కానీ, షూరిటీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని వదలదు. ఎందుకంటే మీకు స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగం మరియు ఆదాయం (జీతం) ఉన్నాయి కాబట్టి, సదరు బాకీ మొత్తాన్ని మీ నుంచే వసూలు చేయాలని కోర్టు ఆదేశిస్తుంది.
 
 
🔥ముగింపు:
 
➡️ చట్టం దృష్టిలో "మొహమాటం", "నమ్మకం" అనే పదాలకు విలువ లేదు... కేవలం మీ "సంతకానికి" మాత్రమే విలువ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు  ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల ఆర్థిక లావాదేవీలకు బెయిల్ (Bail) లేదా షూరిటీ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి.