• Home/
  • /
  • AI Samarth గురించి ముఖ్యమైన సమాచారం:

AI Samarth గురించి ముఖ్యమైన సమాచారం:

 AI Samarth గురించి ముఖ్యమైన సమాచారం:

 
AI Samarth ఆరు పిల్లర్లతో నాలుగున్నర గంటల ఆన్లైన్ కోర్స్ లీప్ యాప్ లో అందుబాటులో ఉంది. ఆ కోర్సును 6 నుండి 8 తరగతిలో బోధించే ఉపాధ్యాయులందరూ ఆకోర్సును కంప్లీట్ చేయాల్సి ఉంది. ఆ కోర్సును అక్టోబర్ నెల చివరి కల్లా పూర్తి చేయమని ప్రొసీడింగ్స్ లో పేర్కొని యున్నాము. అయినను ఇప్పటికీ ఇంకా తక్కువ సంఖ్యలో ఆ కోర్సును  పూర్తి చేసి ఉన్నారు. కాబట్టి వెంటనే స్కూల్ అసిస్టెంట్లు( ఫిజికల్ ఎడ్యుకేషన్ తో సహా ) అందరూ ఈ కోర్సును వెంటనే పూర్తి చేయవలెను. తరువాత ఈ కోర్సు కు సంబంధించి ఒక వెబినార్ సెషన్ జరుగుతుంది. దానిని కూడా కచ్చితంగా వీక్షించాలి. ఈ వెబినార్ సెషన్ క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్స్ లో 11:15 నుంచి 12:15 వరకు మరియు లంచ్ తర్వాత 01:00 నుండి 02:30 వరకు ఈ వెబినార్ సెషన్ రెండు సెషన్లలో జరుగుతుంది. ఆల్రెడీ 21-11-2026 న జరిగిన క్లస్టర్ కాంప్లెక్స్ లో ఈ వెబినార్ సెషన్ పూర్తయింది. ఆ కాంప్లెక్స్ కు హాజరైన ఉపాధ్యాయులందరూ ఈ క్రింది లింకు ద్వారా  వీక్షించి ఉంటారు. https://www.youtube.com/watch?v=lZQboefS-Zk
 
 ఇంకనూ వీక్షించని ఉపాధ్యాయులు ఇప్పటికైనా పై లింకు ద్వారా వీక్షించవలెను. తరువాత మరలా 28-11-2026 న జరగబోవు క్లస్టర్ కాంప్లెక్స్ లలో కూడా అదే టైమింగ్స్ లో వెబినార్ సెషన్ జరుగుతుంది. ఆరోజు హాజరయ్యే ఉపాధ్యాయులందరూ అజెండాలోని లింకు ద్వారా వీక్షించవలెను. కావున 6 నుండి 8 తరగతులు బోధించు ఉపాధ్యాయులందరూ ఆరు పిల్లర్ల ఆన్లైన్ కోర్సును కంప్లీట్ చేసి మరియు వెబినార్ సెషన్ ను వీక్షించిన తర్వాత మరలా లీప్ యాప్ లోనికి వెళ్లి ఫీడ్ బ్యాక్ కం క్విజ్ ను కంప్లీట్ చేయవలెను. ప్రస్తుతం 21-11-2026 న జరిగిన క్లస్టర్ కాంప్లెక్స్ నందు వెబినార్ సెషన్ ను వీక్షించిన ఉపాధ్యాయులందరూ ఫీడ్ బ్యాక్ కం క్విజ్ ను కంప్లీట్ చేయవచ్చును. ఫీడ్ బ్యాక్ కం క్విజ్ ను కంప్లీట్ చేయడానికి లీప్ యాప్ లో కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 4532 
అనే కోడ్ ని ఎంటర్ చేసి ఫీడ్ బ్యాక్ కం క్విజ్ ను కంప్లీట్ చేయవలెను. 
 
నవంబర్ చివరి నాటికి అందరికీ సర్టిఫికెట్లు జనరేట్ అవుతాయి. అప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చును. దీనిపై ఇంకా ఏమైనా సందేహాలు వున్నచో శ్రీ యం. రవీంద్ర ప్రసాద్ SCERT 9666146850 ను సంప్రదించవచ్చును.
 
     ధన్యవాదాలు
డైరెక్టర్, SCERT, AP