• Home/
  • /
  • AP Govt Memo: నవంబర్ 14న ఆ ఉద్యోగులకు సెలవు మంజూరు!

AP Govt Memo: నవంబర్ 14న ఆ ఉద్యోగులకు సెలవు మంజూరు!

📢 *AP Govt Memo: నవంబర్ 14న ఆ ఉద్యోగులకు సెలవు మంజూరు!*
 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ 14 (రెండో శనివారం) పనిదినం విషయంలో కీలక స్పష్టతనిస్తూ అధికారిక మెమో విడుదల చేసింది.
 
🔹 *ముఖ్య వివరాలు:*
• *మెమో నెం:* Memo.No.2970189/Poll.B/2025-5, తేదీ: 11.11.2026.
• గతంలో అక్టోబర్ 19న సాధారణ సెలవు ఇచ్చి, దానికి బదులుగా నవంబర్ 14ను పనిదినంగా నిర్ణయించారు.
• అయితే అక్టోబర్ 19న అధికారిక విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు నవంబర్ 14న సెలవు వినియోగించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.
 
👥 *ఎవరికి సెలవు వర్తిస్తుంది?*
• 19.10.2026న ఎన్నికల విధులు, దసరా ఉత్సవాలు లేదా విజయవాడ సరస్ (SARAS) ఫెస్టివల్ వంటి అధికారిక విధుల్లో పాల్గొని సెలవు పొందలేని వారికి మాత్రమే.
• సంబంధిత సక్షమ అధికారి (Competent Authority) వీరి రికార్డులను పరిశీలించి ధ్రువీకరించాల్సి ఉంటుంది.
 

⚠️ *గమనిక:* మిగిలిన సాధారణ ఉద్యోగులందరికీ నవంబర్ 14 యథావిధిగా పనిదినమే అవుతుంది.