**AP 10వ తరగతి SA-1 పరీక్షలు 2026-27 – స్కూల్ లెవల్ అబ్జర్వర్స్ నియామకంపై కీలక సూచనలు**
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ Class 10 SA-1 పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూల్యాంకనం, LEAP Appలో మార్కుల నమోదు పర్యవేక్షణ కోసం School Level Observers (SLOs) నియామకంపై అదనపు మార్గదర్శకాలు జారీ చేసింది.
🔹 10వ తరగతి SA-1 పరీక్షలు 09-11-2026 నుండి 20-11-2026 వరకు నిర్వహణ.
🔹 ప్రతి పాఠశాలకు పరీక్ష జరిగే రోజున ఒక School Level Observer (SLO) నియామకం.
🔹 పరీక్షల పరిశీలనకు వేరే మండలానికి చెందిన School Assistant ఉపాధ్యాయులను నియమించాలి.
🔹 భాషా పరీక్షల రోజుల్లో నాన్-లాంగ్వేజ్ School Assistantలను అబ్జర్వర్లుగా నియమించాలి.
🔹 నాన్-లాంగ్వేజ్ పరీక్షల రోజుల్లో లాంగ్వేజ్ School Assistantలను నియమించాలి.
🔹 పరీక్ష ప్రారంభ సమయం ఉదయం 9:15 గంటలు, ముగింపు సమయం మధ్యాహ్నం 12:30 గంటలు.
📝 **జవాబు పత్రాల మూల్యాంకనం:**
🔹 పరీక్ష జరిగిన పాఠశాలలోనే అదే సబ్జెక్టు ఉపాధ్యాయుడు మూల్యాంకనం చేయాలి.
🔹 పరీక్ష జరిగిన తేదీ తర్వాత 3 పని దినాల్లో మూల్యాంకనం పూర్తి చేయాలి.
🔹 4వ రోజు అదే సబ్జెక్టుకు చెందిన మరో పాఠశాల ఉపాధ్యాయుడు అబ్జర్వర్‌గా వచ్చి మూల్యాంకనాన్ని పరిశీలించాలి.
🔹 కనీసం 5% జవాబు పత్రాలు లేదా 5 జవాబు పత్రాలు (ఏది ఎక్కువైతే అది) రాండమ్‌గా తనిఖీ చేయాలి.
🔹 5 కంటే తక్కువ జవాబు పత్రాలు ఉంటే అన్నింటినీ పరిశీలించాలి.
📱 **LEAP App మార్కుల నమోదు:**
🔹 అబ్జర్వర్ పరిశీలన అనంతరం 4వ రోజు నుంచి 7వ రోజు వరకు LEAP Appలో మార్కులు నమోదు చేయాలి.
🔹 ప్రతి పాఠశాలలో 7వ రోజు లోపు మార్కుల నమోదు పూర్తి చేయాలి.
🔹 అబ్జర్వర్ మార్కులను స్వయంగా మార్చకూడదు. తప్పులుంటే HM మరియు సంబంధిత మూల్యాంకన ఉపాధ్యాయుడు సరిచేయాలి.
🏫 **అధికారుల బాధ్యతలు:**
🔹 HMలు అబ్జర్వర్లకు పూర్తి సహకారం అందించాలి.
🔹 MEOలు అబ్జర్వర్ల నివేదికలు స్వీకరించి, తప్పులను వెంటనే సరిచేయాలి.
🔹 DEOలు అబ్జర్వర్ల డ్యూటీ ఆర్డర్లు జారీ చేసి పరీక్షల నిర్వహణను పర్యవేక్షించాలి.
🔹 District Nodal Officers కనీసం రెండు రోజులు పాఠశాలలను సందర్శించాలి.
📅 **మార్కుల నమోదు చివరి తేదీలు:**
▪️ First Language – 18-11-2026
▪️ Second Language – 19-11-2026
▪️ Third Language – 20-11-2026
▪️ Mathematics – 21-11-2026
▪️ Physical Science – 25-11-2026
▪️ Biological Science – 26-11-2026
▪️ Social Studies – 27-11-2026
మిషన్ మార్చ్ 2027 లో భాగంగా పదో తరగతి సమ్మేటివ్ అసెస్మెంట్-1 (SA-1) పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడం,
మూల్యాంకనం (Evaluation) చేయడం,
అలాగే LEAP యాప్‌లో మార్కుల నమోదును పర్యవేక్షించడానికి...
స్కూల్ లెవల్ అబ్జర్వర్ల (SLO) నియామకంపై అదనపు మార్గదర్శకాలు జారీ అయ్యాయి.
ఈ ఉత్తర్వులు కేవలం 10వ తరగతికి (ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలకు మాత్రమే) వర్తిస్తాయి.
1 నుండి 9 తరగతులకు పాత మార్గదర్శకాలే వర్తిస్తాయి.