• Home/
  • /
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన ఉత్తర్వులు - G.O.RT.No.1125, తేదీ: 17.11.2026

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన ఉత్తర్వులు - G.O.RT.No.1125, తేదీ: 17.11.2026

 *🅰️🅿️ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన ఉత్తర్వులు - G.O.RT.No.1125, తేదీ: 17.11.2026*

* పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ (PR&RD Dept.) – గ్రామ పంచాయతీల సర్పంచ్ మరియు వార్డు సభ్యుల 2వ సాధారణ ఎన్నికలు – 26.11.2026, 29.11.2026 మరియు 02.12.2026 తేదీలలో పోలింగ్ జరగనున్న దృష్ట్యా ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలు/కార్యాలయాల ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించు కునేందుకు స్థానిక సెలవు (లోకల్ హాలిడే) ప్రకటిస్తూ  ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
 
 *ముఖ్యాంశాలు*
 
 *ఎన్నికల వివరాలు:*
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల సర్పంచ్ మరియు వార్డు సభ్యుల 2వ సాధారణ ఎన్నికలు మూడు దశల్లో జరుగుతాయి.
 
 *పోలింగ్ తేదీలు:*
 నవంబర్ 26, 2026, నవంబర్ 29, 2026 మరియు డిసెంబర్ 2, 2026 తేదీలలో పోలింగ్ నిర్వహిస్తారు.
 
 *వేతనంతో కూడిన సెలవు:* ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ రంగ సంస్థలు, వాణిజ్య మరియు పారిశ్రామిక సంస్థలలో పనిచేసే ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించు కునేందుకు, ఆయా పోలింగ్ రోజులలో వేతనంతో కూడిన స్థానిక సెలవు (Paid Holiday) ప్రకటించాలని యాజమాన్యాలను ప్రభుత్వం కోరింది.
 
 *ప్రత్యామ్నాయ పనిదినం:*
 ఉత్పత్తి లక్ష్యాలకు (Production targets) ఆటంకం కలగకుండా ఉండేందుకు, ఈ సెలవుకు బదులుగా మరొక సెలవు రోజును పనిదినంగా మార్చుకునే వెసులుబాటును యాజమాన్యాలకు కల్పించారు.
 
 *3 గంటల వెసులుబాటు:*
 ఒకవేళ పూర్తి రోజు సెలవు ఇవ్వడం సాధ్యం కాకపోతే, పోలింగ్ సమయాల్లో ఉద్యోగులు ఓటు వేయడానికి వీలుగా కనీసం 3 గంటల పాటు అనుమతి (Time off) ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది.
 
 *అధికారులకు ఆదేశాలు:*
 ఈ ఉత్తర్వులను సంబంధిత యాజమాన్యాల దృష్టికి తీసుకెళ్లి, అవి కచ్చితంగా అమలయ్యేలా చూడాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.