• Home/
  • /
  • క్లిక్కర్స్ స్వీకరించిన ప్రధానోపాధ్యాయులందరికీ ముఖ్య గమనిక:.

క్లిక్కర్స్ స్వీకరించిన ప్రధానోపాధ్యాయులందరికీ ముఖ్య గమనిక:.

*క్లిక్కర్స్ స్వీకరించిన ప్రధానోపాధ్యాయులందరికీ ముఖ్య గమనిక:.*
 
1.  ఏ పాఠశాల యందు ఏ సబ్జెక్టు టీచర్ క్లిక్కర్స్ ఎంతవరకు సమర్థవంతంగా వినియోగించుచున్నారో, ఎవరు వినియోగించుట లేదో  రాష్ట్ర కమిషనర్ కార్యాలయము నుండి ఒక ప్రత్యేక డాష్ బోర్డు ద్వారా నిరంతరము పర్యవేక్షణ జరుగుచున్నది కావున ఈ విషయమును క్లిక్కర్స్ స్వీకరించిన ప్రధానోపాధ్యాయులు అందరూ గమనించి 9వ తరగతి బోధించు ప్రతి సబ్జెక్టు టీచర్లకు ఈ విషయమును తెలియజేసి,  ప్రతిరోజు మీ పాఠశాలల యందు క్లిక్కర్స్ తప్పనిసరిగా వినియోగించునట్లు తగు చర్యలు తీసుకోవలసినదిగా ప్రధానోపాధ్యాయులను ఆదేశించడమైనది.
 
 2.  రాష్ట్ర కమిషనర్ కార్యాలయం వారి ఆదేశాలను అనుసరించి  9వ తరగతి నందు క్లిక్కర్స్ వినియోగించని సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయులు మరియు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అందుకు గల కారణములను జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయమునకు తప్పనిసరిగా లిఖితపూర్వకంగా  తెలియచేయవలసినదిగా కోరడమైనది.
 
3.  క్లిక్కర్స్ సమర్థవంతంగా పని చేయు నిమిత్తము మీకు పంపిణీ చేయబడిన చార్జింగ్ డాక్, రిసీవర్, పవర్ అడాప్టర్ మరియు క్లిక్కర్స్ సంబంధిత సామాగ్రిని పాఠశాల ప్రధానోపాధ్యాయుని పర్యవేక్షణలో 9వ తరగతి బోధించు సబ్జెక్టు ఉపాధ్యాయులు మిక్కిలి జాగ్రత్తగా వినియోగించుకోవలెను. క్లిక్కర్స్ పనిచేయు నిమిత్తము మీ పాఠశాలకు పంపిణీ చేయబడిన సామాగ్రికి ప్రధానోపాధ్యాయులు మరియు 9వ తరగతి బోధించు సబ్జెక్టు ఉపాధ్యాయులు అందరూ ఉమ్మడి బాధ్యత తీసుకోవలెను. 
 
4.  మీకు పంపిణీ చేయబడిన సామాగ్రి నందు ఏ ఒక్క సామాగ్రి కనబడకపోయిన, పోగొట్టుకొనిన లేక పగిలిపోయిన సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు 9వ తరగతి బోధించు సబ్జెక్టు ఉపాధ్యాయులు ఉమ్మడిగా బాధ్యత వహించవలెను.
 
5.   మీరు పోగొట్టుకొనిన లేక కోల్పోయిన సామాగ్రి మరలా మీకు పంపిణీ చేయుటకు జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయము నందు అదనంగా ఎటువంటి సామాగ్రి లేదని తెలియజేయడమైనది. అంతేకాక బయట  క్లిక్కర్స్ కు సంబంధించిన ఏ సామాగ్రి కూడా మీకు ఏ షాప్ నందు కూడా లభించదని తెలియజేయడమైనది. 
 
6.  కావున క్లిక్కర్స్ స్వీకరించిన ప్రధానోపాధ్యాయులు మరియు 9వ తరగతి బోధించు ప్రతి సబ్జెక్టు టీచర్ ఉమ్మడిగా క్లిక్కర్స్ కు బాధ్యత వహించవలెను. ఎటువంటి పరిస్థితులలో కూడా విద్యార్థులకు క్లిక్కర్స్ బాధ్యత అప్పగించి వాటిని కోల్పోవుట గాని లేదా పోగొట్టుకొనుటగాని చేయరాదని ప్రధానోపాధ్యాయులందరికీ స్పష్టంగా తెలియజేయడమైనది.