*🚨 ‘తల్లికి వందనం’ లబ్ధిదారులకు అత్యంత ముఖ్యమైన హెచ్చరిక 🚨*
🌸 ‘తల్లికి వందనం’ నిధులు జూలై 22 నుండి దశలవారీగా జమ 🌸
✅ అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో ఒక్కో విద్యార్థికి ₹13,000 చొప్పున నేరుగా జమ చేయబడుతుంది.
📅 జూలై 22 నుండి 24 వరకు దశలవారీగా నిధులు జమ కానున్నాయి.
---
⚠️ సైబర్ నేరగాళ్ల నకిలీ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండండి!
❌ "డబ్బులు పొందాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి"
❌ "ఈ యాప్‌ను వెంటనే ఇన్‌స్టాల్ చేయండి"
❌ "మీ బ్యాంక్ వివరాలు నమోదు చేయండి"
👉 ఇలాంటి మెసేజ్‌లు పూర్తిగా నకిలీవి. వాటిని నమ్మవద్దు.
🚫 తెలియని లింకులపై క్లిక్ చేయవద్దు.
🚫 OTP, ATM PIN, బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్ వివరాలను ఎవరికీ ఇవ్వవద్దు.
🚫 ప్రభుత్వ పథకాల పేరుతో వచ్చే ఫేక్ కాల్స్, మెసేజ్‌లు, వాట్సాప్ లింకులను నమ్మవద్దు.
---
📢 సమస్యలు ఉంటే ఇలా చేయండి
✅ పథకం నిధుల జమలో ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటే...
🔹 మీ గ్రామ/వార్డు సచివాలయాన్ని సంప్రదించండి.
🔹 సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించండి.
🔹 దళారులను లేదా మధ్యవర్తులను నమ్మవద్దు.
---
🛡️ గుర్తుంచుకోండి
✅ ప్రభుత్వం ఎప్పుడూ డబ్బులు పొందడానికి లింక్‌పై క్లిక్ చేయమని అడగదు.