• Home/
  • /
  • ఏపీ విద్యా సర్వీస్ రూల్స్ 2026 నకు కీలక సవరణలతో G.O.Ms.No.53 విడుదల.

ఏపీ విద్యా సర్వీస్ రూల్స్ 2026 నకు కీలక సవరణలతో G.O.Ms.No.53 విడుదల.

*📢 ఏపీ విద్యా సర్వీస్ రూల్స్ 2026 నకు కీలక సవరణలతో G.O.Ms.No.53 విడుదల.*
 
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ 17 నవంబర్ 2026న జారీ చేసిన ఈ ఉత్తర్వులో ప్రత్యక్ష నియామకాల వయోపరిమితి, DyEO శిక్షణ, SCERT–DIET పోస్టుల అర్హతలను సవరించారు. సవరణలు 15 సెప్టెంబర్ 2026 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు.
 
✅ DEO (DR) తో సహా అన్ని ప్రత్యక్ష నియామకాలు – రూల్ 7
నియామక నోటిఫికేషన్ జారీ చేసిన సంవత్సరం *జూలై 1 నాటికి 34 సంవత్సరాలు నిండి ఉండకూడదు.* అర్హత కలిగిన వర్గాలకు రూల్ 12 ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
*✅ DyEO:* ప్రత్యక్ష నియామకం ద్వారా ఎంపికైనవారు ప్రొబేషన్ కాలంలో రెండేళ్ల PGD-SELA పూర్తి చేయాలి.

*✅ SCERT–DIET:* లెక్చరర్ పోస్టుల విద్యార్హతలను సవరించారు. SCERT లెక్చరర్ పోస్టులకు నిర్దేశిత అర్హతలతో పాటు NET/APSET లేదా UGC నిబంధనలకు అనుగుణమైన Ph.D. అవసరం.