• Home/
  • /
  • తల్లీ వందనం డేటా వెరిఫికేషన్ అంటే ఏమిటి?

తల్లీ వందనం డేటా వెరిఫికేషన్ అంటే ఏమిటి?

 

 1. తల్లీ వందనం డేటా వెరిఫికేషన్ అంటే ఏమిటి?

 
తల్లీ వందనం పథకం కింద అర్హులైన విద్యార్థుల మరియు వారి తల్లుల వివరాలను సచివాలయ హౌసోల్డ్ డేటాబేస్తో సరిపోల్చే ప్రక్రియ ఇది.
 
2. ఈ డేటా వెరిఫికేషన్ ఎవరు పూర్తి చేయాలి?
 
గ్రామ/వార్డు సచివాలయంలోని వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ (WEA) లేదా వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ (WWES) ఈ వెరిఫికేషన్ పూర్తి చేయాలి.
 
3. వెరిఫికేషన్ మాడ్యూల్ ఏ పోర్టల్లో అందుబాటులో ఉంది?
 
ఈ వెరిఫికేషన్ మాడ్యూల్ నవశకం లబ్దిదారుల మేనేజ్ మెంట్ పోర్టల్ లో (Beneficiary Management Portal) అందుబాటులో ఉంటుంది.
 
4. తల్లి వివరాలు డేటాబేస్లో లేకపోతే ఏం చేయాలి?
 
తల్లి అందుబాటులో ఉంటే ఆమెను హౌసోల్డ్ డేటాబేస్లో చేర్చాలి. లేనిపక్షంలో తండ్రి లేదా గార్డియన్ వివరాలను నమోదు చేయాలి.
 
5. విద్యార్థి మరియు తల్లి వేర్వేరు కుటుంబాలలో ఉంటే ఎలా సరిచేయాలి?
 
(Migration Options)
 
ఉపయోగించి వారిద్దరినీ ఒకే హౌస్రోల్డ్ కిందకు తీసుకురావాలి.
 
6. ఒకే తల్లికి నలుగురు కంటే ఎక్కువ పిల్లలు ఉంటే ఏం చేయాలి?
 
క్షేత్రస్థాయికి వెళ్లి పిల్లలందరూ ఆ తల్లికే జన్మించారా లేదా అనేది వెరిఫై చేసి, సరైన రిమార్కులు నమోదు చేయాలి.
 
7. విద్యార్థి మరియు తల్లికి ఒకే ఐడీ నంబర్ ఉంటే ఏం చేయాలి?
 
సదరు ఐడీ నంబర్ ను సరైన వ్యక్తికి ట్యాగ్ చేసి, రెండో వ్యక్తి యొక్క అసలైన ఐడీ వివరాలను సేకరించి అప్డేట్ చేయాలి.
 
8. ఈ వెరిఫికేషన్ ఏ క్లాస్ విద్యార్థులకు వర్తిస్తుంది?
 
ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ (Class 1 to 12) వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఇది వర్తిస్తుంది.
 
9. డేటా వెరిఫికేషన్ తప్పుగా జరిగితే ఏమవుతుంది?
 
డేటా వెరిఫికేషన్ సకాలంలో మరియు ఖచ్చితంగా పూర్తి చేయకపోతే అర్హులైన విద్యార్థులకు తల్లీ వందనం పథకం నిధులు నిలిచిపోయే అవకాశం ఉంది.
 
10. తల్లీ వందనం లబ్ధిదారుల తుది జాబితా ఎప్పుడు విడుదల అవుతుంది?
 
సచివాలయ ఉద్యోగులు ఈ 5 రకాల సమస్యలను పరిష్కరించి వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాతే తుది అర్హుల జాబితా విడుదలవుతుంది.