.jpeg)
★ AP SPECIAL TET RESPONSE షీట్స్ చెక్ చేసే లింక్👇
Special Tet లో మీకు వచ్చిన మార్కులు ఈ క్రింది లింక్ లో తెలుసుకోండి
ఏపీ ప్రత్యేక టెట్–ఆగస్టు–2026: అభ్యర్థుల వ్యక్తిగత రెస్పాన్స్ షీట్లు విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP Special TET–August 2026)కు సంబంధించిన ప్రశ్నపత్రాలు, ప్రాథమిక కీ (Initial Key)లను ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచడం జరిగింది. తాజాగా, పరీక్షలకు హాజరైన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయ అభ్యర్థుల వ్యక్తిగత రెస్పాన్స్ షీట్లను (Individual Response Sheets) నేడు విడుదల చేయడం జరిగింది.
అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా రెస్పాన్స్ షీట్లలో నమోదైన సమాధానాలను ప్రాథమిక కీతో సరిపోల్చుకుని పరిశీలించుకోవచ్చు.
ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు 29.10.2026 నుంచి 04.11.2026 వరకు తమ Candidate Login ద్వారా లాగిన్ అయి, సంబంధిత ఆధారాలతో అధికారిక వెబ్‌సైట్‌లైన
https://tet2dsc.apcfss.in ద్వారా మాత్రమే అభ్యంతరాలను తెలియజేయాలని. గడువు ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యంతరాలు స్వీకరించబడవు. అదేవిధంగా, వ్యక్తిగతంగా, ఉత్తరాల ద్వారా లేదా మెసేజ్‌ల రూపంలో సమర్పించే అభ్యంతరాలను కూడా స్వీకరించడం జరగదని స్పష్టం చేయడమైనది.
ఎం. వెంకట కృష్ణారెడ్డి
కన్వీనర్, ఏపీ ప్రత్యేక టెట్–2026
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం