Flash.. AP Employees, Teachers Districts Bifurcation G.O.MS.No. 45 Dated: 20-04-2026 Released
🚨The AP Public Employment (Organisation of Local Cadres and Regulation of Direct Recruitment) Order 2025
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్ సర్వీస్ ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలలో స్థానిక, స్థానికేతరను నిర్ణయించు విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవో విడుదల.
📢 ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు మరియు ఉద్యోగులకు ముఖ్య గమనిక!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక కేడర్ల పునర్వ్యవస్థీకరణ మరియు ఉద్యోగ నియామకాలకు సంబంధించి కొత్త జీవో (G.O.MS.No. 45) విడుదల చేసింది.
మరిన్ని వివరాలకు click the below link to download GOMS NO-45
దీని ప్రకారం ముఖ్యమైన మార్పులు ఇవే:
🌐 *95% రిజర్వేషన్:* జిల్లా, జోనల్ మరియు మల్టీ-జోనల్ స్థాయి పోస్టుల్లో ప్రత్యక్ష నియామకాల కోసం *95% పోస్టులు స్థానిక అభ్యర్థులకే* కేటాయించబడతాయి.
🌐 *స్థానికత (Locality) గుర్తింపు:* * అర్హత పరీక్షకు ముందు వరుసగా *4 విద్యా సంవత్సరాలు* ఎక్కడ చదివితే ఆ ప్రాంతమే మీ స్థానిక ప్రాంతం అవుతుంది.
* విద్యా సంస్థల్లో చదవని వారు, 4 ఏళ్ల నివాసం ప్రాతిపదికన స్థానికతను పొందవచ్చు.
* ఒకవేళ 4 ఏళ్ల నిబంధన సరిపోకపోతే, వరుసగా 7 ఏళ్ల చదువు/నివాసం ఆధారంగా గరిష్ట కాలం ఎక్కడ ఉంటే దానిని పరిగణిస్తారు.
✳️ *ఉపాధ్యాయుల కేటాయింపు:* * ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి *జిల్లాను* ఒక యూనిట్‌గా పరిగణిస్తారు.
* పాత జిల్లాల నుండి కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపులో సీనియారిటీ, పరిపాలనా అవసరాలు మరియు అభ్యర్థుల ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకుంటారు.
* కేటాయింపుపై అభ్యంతరాలు ఉంటే 60 రోజుల్లోపు విజ్ఞప్తి చేసుకోవచ్చు.
🔹 *జోన్ల విభజన:* మొత్తం రాష్ట్రం *6 జోన్లుగా* మరియు *2 మల్టీ-జోన్లుగా* విభజించబడింది.
📍 *మినహాయింపులు:* సెక్రటేరియట్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ (HoD) కార్యాలయాలు, రాష్ట్ర స్థాయి సంస్థలు మరియు రాజధాని ప్రాంత పోలీస్ పోస్టులకు ఈ స్థానిక రిజర్వేషన్ నిబంధనల నుండి మినహాయింపు ఉంది.