👆 *❇️Public Services - Pensions - Settlement of Pensionary benefits in-time
to the retired Government Employees - Payment of penal interest in*
*case of delay – Rate of Interest where the payment of Pension/Gratuity
delayed – Revised orders -Issued.*⬆️
పెన్షన్ లేదా గ్రాట్యుటీ ఆలస్యమైతే ఆ ఆలస్యం పరిపాలనా కారణాల వల్ల అని నిర్ధారితమైతే, ఆ మొత్తంపై GPF వడ్డీ రేటుతో సమానమైన వడ్డీ చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – ఆర్థిక (HR–III–పెన్షన్ & GPF) శాఖ G.O.Ms.No.59, తేదీ: 07-10-2025 జారీ చేసి ఉన్నారు.
ప్రభుత్వ సేవలు – పెన్షన్లు – ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ లేదా గ్రాట్యుటీ చెల్లింపులు సమయానికి చేయకపోవడం వల్ల ఏర్పడిన ఆలస్యానికి వడ్డీ చెల్లింపు – ఆ వడ్డీ రేటు పునఃపరిశీలన – ఆదేశాలు జారీ చేయబడినవి.
అంటే పెన్షన్ / గ్రాట్యుటీ చెల్లింపులో ఆలస్యమైతే వడ్డీ చెల్లింపు రేటు గురించి జారీ చేసిన కొత్త ఆదేశం.
దీనికి ఈ క్రింది ప్రభుత్వ ఉత్తరువులను రిఫరెన్స్ నందు పొందుపరిచారు
1. జి.ఓ. మస్. నెం.268, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ శాఖ (FW–Pen.I), తేదీ: 07-10-1986
2. సర్క్యులర్ మెమో నెం. 37989/A/494/A.2/Pen.I/98, తేదీ: 21-04-1999
3. సర్క్యులర్ మెమో నెం.16077/135/A.2/Pen.I/2004, తేదీ: 20-02-2006
4. భారత ప్రభుత్వం యొక్క మెమో నెం.12(9)/2020–P&PW(C)–6450, తేదీ: 23-02-202
5. ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980లోని అనుబంధం–I
6. జి.ఓ.ఆర్.టి.నెం.1097, ఫైనాన్స్ శాఖ(FW:Pen.I), తేదీ: 22-06-2000
ఆదేశాలు
మొదటి ఆదేశం ప్రకారం, రిటైర్మెంట్ గ్రాట్యుటీ చెల్లింపులో ఆలస్యమైతే వడ్డీ చెల్లించాలని నిర్ణయించబడింది. దీని ప్రకారం
మొదటి మూడు నెలల తరువాత నుండి ఒక సంవత్సరం వరకు: @7% వార్షిక వడ్డీ,
ఒక సంవత్సరానికి మించి ఆలస్యమైతే: @10% వార్షిక వడ్డీ చెల్లించాలి.
వడ్డీ, గ్రాట్యుటీ చెల్లించవలసిన నెల ముగిసిన తరువాత నుండి వాస్తవ చెల్లింపు జరిగే వరకు లెక్కించాలి.
రెండవ ఆదేశం ప్రకారం, వడ్డీ చెల్లింపుకు ఈ షరతులు ఉన్నాయి:
(i) వడ్డీ మంజూరు ఆ శాఖాధిపతి (Administrative Department) ఆమోదంతో, ఆర్థిక శాఖ (Finance Department) అనుమతితో ఉండాలి.
(ii) క్రమశిక్షణాత్మక లేదా న్యాయ ప్రక్రియలు ఉన్నచో, ఆ ప్రక్రియలు ముగిసిన తేదీ నుండి మాత్రమే వడ్డీ చెల్లించాలి.
(iii) ఆలస్యం పరిపాలనా కారణాల వల్ల మాత్రమే ఉండాలి.
మూడవ ఆదేశం ప్రకారం, వడ్డీ రేటు 3 నెలల తర్వాత 1 సంవత్సరం వరకు: @4.5% పి.ఎ.,
1 సంవత్సరానికి మించి: @5% పి.ఎ. గా నిర్ణయించబడింది.
నాలుగవ ఆదేశం ప్రకారం, భారత ప్రభుత్వం GPF (General Provident Fund) వడ్డీ రేటును ఆదర్శంగా తీసుకుంది.
అంటే పెన్షన్ / ఫ్యామిలీ పెన్షన్ / గ్రాట్యుటీ చెల్లింపులో పరిపాలనా కారణాల వల్ల ఆలస్యమైతే, GPF వడ్డీ రేటుకి సమానంగా వడ్డీ చెల్లించాలి.
పరిపాలనా తప్పిదానికి బాధ్యులైన అధికారులపై శిక్షా చర్యలు తీసుకోవాలని కూడా పేర్కొంది.
కోర్టుల ఆదేశాల ప్రకారం, ఆలస్యమైన పెన్షన్ చెల్లింపుపై @9% – @12% వడ్డీ చెల్లించమని సూచనలు వచ్చినట్లు తెలిపింది.
అందువల్ల ప్రభుత్వం
ఇకపై అన్ని సందర్భాల్లో — పెన్షన్ లేదా గ్రాట్యుటీ సమయానికి మంజూరు కాలేదు, మరియు ఆలస్యం పరిపాలనా కారణాల వల్ల అని స్పష్టంగా తేలితే —ఆలస్యమైన మొత్తంపై GPF వడ్డీ రేటుతో సమానమైన వడ్డీ చెల్లించాలి.
దీనికినిబంధనలు:
i. వడ్డీ మంజూరు చేయడం సంబంధిత శాఖాధిపతి మరియు ఆర్థిక శాఖ అనుమతితో మాత్రమే జరగాలి.
ii. క్రమశిక్షణాత్మక లేదా న్యాయ విచారణలున్నచో, ఆ ప్రక్రియలు ముగిసిన తర్వాతే వడ్డీ లెక్కించాలి.
ఇతర ముఖ్య అంశాలు:
పెన్షన్ పేపర్లు Accountant General (A.G.) కి పంపించాలి.
Class-IV ఉద్యోగుల పెన్షన్ పత్రాలు Audit Officers ద్వారా పరిశీలించాలి.
Provisional Pension (తాత్కాలిక పెన్షన్) సమయానికి మంజూరు కావాలని ఆదేశం.
Gratuity చెల్లింపు క్రమశిక్షణాత్మక లేదా న్యాయ విచారణలు పూర్తయిన తర్వాత మాత్రమే (A.P.R.P.R. 1980, Rule 52(c) ప్రకారం జరగాలి.
దీనివల్ల పెన్షనర్స్ కు బెనిఫిట్స్ చెల్లింపులు సకాలంలో అమలు జరుగుతాయని ఆశించలేము. ఇప్పటికే సంవత్సరకాలం పైబడి రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించవలసిన గ్రాట్యూటీ చెల్లింపులు జరుపబడలేదు. ఎన్కాష్మెంట్ ఆఫ్ ఈ ఎల్ చెల్లింపులు జరగలేదు. పిఎఫ్ చెల్లింపులు కొంతవరకు చెల్లించారు. జిఐఎస్ చెల్లింపులకు వడ్డీ నిర్ణయం పట్టికను సకాలంలో జారీ చేయకపోవడం వల్ల చెల్లింపులు జరగలేదు. ఈ ఉత్తరువు ప్రకారం వీరందరికీ వడ్డీతో సహా ప్రభుత్వం చెల్లించాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తరపున డిమాండ్ చేస్తున్నాము. ఉత్తరవులను జరీ చేయడమే కాక వాటిని గౌరవప్రదంగా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం పై ఉన్నదని ప్రభుత్వ పెద్దలు అధికారులు మరిచిపోరాదు.