• Home/
  • /
  • ఆంధ్ర ప్రదేశ్ శాసన వ్యవస్థ సచివాలయం* పత్రికా ప్రకటన

ఆంధ్ర ప్రదేశ్ శాసన వ్యవస్థ సచివాలయం* పత్రికా ప్రకటన

 ఆంధ్ర ప్రదేశ్ శాసన వ్యవస్థ సచివాలయం*

 
పత్రికా ప్రకటన
 
చట్ట సభల పట్ల విద్యార్థులలో అవగాహన పెంచే ఉద్దేశంతో ఆంధ్ర ప్రదేశ్ శాసన సభస్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రము లోని పాఠశాలలు, కళాశాలలు ఇతర విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు శాసన సభ సందర్శకుల గ్యాలరి నుంచి సభా కార్యకలాపాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అనుమతించాలని నిర్ణయించడమైనది. ఆసక్తి గల ఆయా పాఠశాలలు, కళాశాలల ప్రధానోపాధ్యాయులు/ ప్రిన్సిపల్స్ సందర్శనకు పంపగోరే విద్యార్థుల జాబితాతో అధికారిక అభ్యర్ధన లేఖను ఇ - 2 legis.passes@gmail.com పంపవచ్చు. ప్రధానోపాధ్యాయులు/ప్రిన్సిపల్స్ సంతకాలు, స్టాంపు తో కూడిన అధికారిక అభ్యర్ధన లేఖను, విద్యార్థుల పేరు, ఆధార్ నెంబర్ తదితర వివరాలతో కూడిన జాబితాను స్కాన్ చేసి ఇ -మెయిల్ ద్వారా పంపాలి. ఒక్కో బ్యాచ్ కి 45 నిమిషాల వరకు సభా కార్యకలాపాలు వీక్షించే అవకాశం లబిస్తుంది. ప్రతి బ్యాచ్ కి గరిష్టంగా 30 మంది విద్యార్థులను అనుమతిస్తారు. అవసరమైతే మరిన్ని వివరాలకు ఈ క్రింది ఫోన్ నెంబర్లును సంప్రదించవచ్చు.

: +91-863-2449184 +91-863-2449185