మండల విద్యాశాఖ అధికారులు–II
మీ మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమన్వయం చేసుకొని, విద్యార్థుల SRKVM కిట్ల బయోమెట్రిక్ ధృవీకరణ ప్రక్రియను అత్యవసర ప్రాధాన్యతతో పూర్తి చేయించాలి. 13-07-2026 మరియు 14-07-2026 తేదీలలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టి, ప్రతి తరగతి ఉపాధ్యాయుని ద్వారా 100% బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలి.ఈ అంశంపై గౌరవనీయులైన SPD గారు 15-07-2026న సమీక్ష నిర్వహించనున్నందున, మండల పరిధిలోని ఏ పాఠశాలలోనూ బయోమెట్రిక్ ధృవీకరణ పెండింగ్ లేకుండా 14-07-2026 సాయంత్రం 4:00 గంటలలోపు పూర్తి చేయించాలి.
– జిల్లా విద్యాశాఖ అధికారి