• Home/
  • /
  • BC /OBC Non - creamy layor సర్టిఫికెట్ - జారీ :

BC /OBC Non - creamy layor సర్టిఫికెట్ - జారీ :

 *🍄BC /OBC  Non - creamy  layor సర్టిఫికెట్ - జారీ :*

 
 
ఇటీవల విడుదలైన APPSC గ్రూప్ I మరియు ఇతర, పోటీ పరీక్షల కోసం, BC /OBC  Non - creamy  layor సర్టిఫికెట్ పొందుటలో, అవగాహనా లేమితో కానీ, మరేదైనా, కారణంతో కానీ, BC /OBC అభ్యర్థులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు : కావున, కేవలం ఈ క్రింది తెలిపిన సందర్భాలలో మాత్రమే, BC  అభ్యర్థులు , క్రీమి లేయర్ పరిధి లోకి వస్తారు: 
1 . తల్లిదండ్రులులో ఎవరైనా రాజ్యాంగ బద్దమైన పోస్ట్స్ లో ఉన్నపుడు 
 2 .అభ్యర్థుల, తల్లి/తండ్రి , ఇద్దరిలో ఎవరైనా ఒకరు, డైరెక్ట్ గా, గ్రూపు I  లేదా సమానస్థాయి లేదా పై స్థాయి పోస్ట్ లో నియమితులైనప్పుడు,
3 . . తల్లిదండ్రులు ఇద్దరు, డైరెక్ట్ గా, గ్రూపు II  లేదా సమానస్థాయి పోస్ట్ లో నియమితులైనప్పుడు,
4 . అభ్యర్థుల, తల్లి/తండ్రి , ఇద్దరిలో ఎవరైనా ఒకరు, డైరెక్ట్ గా, గ్రూపు II  లేదా సమానస్థాయి పోస్ట్ లో నియమితులై, వారి వయస్సు, 40 సంవత్సరాలు రాకముందే, గ్రూప్ i స్థాయి పోస్ట్  పదోన్నతి పొందినప్పుడు, 
5 . లాయర్లు, డాక్టర్స్ వంటి ప్రొఫెషనల్స్ గ తల్లిదండ్రులు ఉంటె, వారి ఆదాయం, దరఖాస్తు చేసుకునే నాటికి ముందు మూడు వరుస ఆర్థిక సంవత్సరాల లో ఆదాయం,8 లక్షలు రూపాయాల కంటే ఎక్కువగా ఉన్నపుడు, 
సాధారణంగా, పై కేసులలో, తప్ప, మిగతా, అన్ని కేసులలో,బీసీ/ఓబీసీ అభ్యర్థులు, నాన్ క్రీమి లేయర్ సర్టిఫికెట్ పొందుటకు అర్హులే.
తల్లిదండ్రులు, ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పుడు, వారి సంసవత్సర జీతం, ఎంత ఐన, సంభంధం లేదు. ప్రైవేట్ ఉద్యోగులు అయితే, మాత్రం, 8 లక్షల షరతు వర్తిస్తుంది.
వ్యవసాయ సంభందిత ఆదాయం పరిగణించకూడదు.
బీసీ/ఓబీసీ క్రీమి లేయర్ నిర్ణయానికి, కేవలం తల్లిదండ్రుల, ఆదాయం, ప్రభుత్వ హోదా మాత్రమే, పరిగణలోకి తీసుకోవాలి, దరఖాస్తు చేసుకునే అభ్యర్థి ఆదాయం/హోదా కాదు. ఉదా: ఒక అభ్యర్థి, డైరెక్ట్ గా, IPS/డిప్యూటీ కలెక్టర్ వంటి పోస్ట్ సాధించిన సరే, మరల, ఐఏఎస్ కోసం సివిల్స్ కు దరఖాస్తు చేసుకునేటప్పుడు, NON -Creamy layor కోట కింద పరిగణించపడతారు. కానీ, EWS కేటగిరీ వారికి మాత్రం ఈ సౌలభ్యం లేదు, అభ్యర్థి ఆదాయం, అతని/ఆమె, భార్య,/భర్త, తల్లిదండ్రులు, సోదర /సోదరీమణుల, అభ్యర్థి, పిల్లల ఆదాయం అనగా,కుటుంబ సభ్యుల అందరి ఆదాయం, 8 లక్షల రూపాయలు మించకూడదు. అప్పుడు మాత్రమే, ews కోట కింద అర్హుడు. 
అలాగే, కింది సందర్భాలలో కూడా EWS కోటాకు అనర్హులే :
Agricultural Land: 5 acres or more. (If your family owns 3 acres in one state and 2.5 acres in another, the lands are clubbed together, totaling 5.5 acres, resulting in disqualification).
Residential Flat: 1,000 square feet or more.
Residential Plot (Notified Municipality): 100 square yards or more.
Residential Plot (Non-Notified Area): 200 square yards or more.'