• Home/
  • /
  • సర్కారీ బడుల్లో ప్రీప్రైమరీ సెక్షన్లకు ప్రపోజల్స్

సర్కారీ బడుల్లో ప్రీప్రైమరీ సెక్షన్లకు ప్రపోజల్స్

 *సర్కారీ బడుల్లో ప్రీప్రైమరీ సెక్షన్లకు ప్రపోజల్స్*

 
📍10లోగా పంపాలని డీఈఓలకు డైరెక్టర్ ఆదేశం
 
రాష్ట్రంలోని సర్కారు ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో వచ్చే ఏడాది ప్రీప్రైమరీ (ఎల్కేజీ, యూకేజీ) సెక్షన్ల ను మరిన్ని ప్రారంభించేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. 
 
తమ జిల్లాల పరిధిలో ప్రీప్రైమరీ సెక్షన్లు ప్రారంభించడానికి వీలున్న స్కూళ్ల జాబితా ను సిద్ధం చేసి, ఈ నెల 10లోగా పంపించా లని డీఈఓలకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు. ఈ విద్యా సంవత్సరం (2025-26) లో స్థానిక అవసరాల దృష్ట్యా ఇప్పటికే ప్రీప్రైమరీ క్లాసులు నడుపుతూ, ఇంకా ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతి లభించని స్కూళ్ల వివ రాలను ప్రాధాన్యత క్రమంలో పంపాలని సూచించారు. 
 
అలాగే, విద్యార్థుల ఎన్రో ల్మెంట్ ఎక్కువగా ఉండి, ఆయా బడుల పరిధిలో ప్రీప్రైమరీ వయసు పిల్లలు అందు బాటులో ఉన్న చోట కొత్త సెక్షన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. 
 
అయితే, ఆయా బడుల్లో ప్రీప్రైమరీ క్లాసుల నిర్వహణకు అదనంగా గదులు అందుబాటులో ఉండటం తప్పనిసరి అని పేర్కొన్నారు.