*ఈరోజు CSE లో గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల సమావేశం లో చర్చించిన అంశములు*
లీప్ యాప్, ఇతర యాప్ ల వల్ల ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు.
విద్యార్థులకు నాణ్యమైన, సామర్థ్య ఆధారిత బోధన జరగాలంటే ఉపాధ్యాయులకు బోధనకు మాత్రమే పరిమితం చేయాలని విద్యాశాఖ అధికారులకు ప్రాతినిధ్యం చేసారు.
-- ఉన్నత అధికారులతో చర్చించి తగు నిర్ణయం చేస్తామని చెప్పారు.
** ప్రభుత్వ పాఠశాలలో అన్ని తరగతుల అడ్మిషన్స్ కోసం సైట్ ని ఓపెన్ చేయాలని కోరగా
-- అన్ని తరగతులకు అడ్మిషన్స్ కోసం సైట్ ని ఓపెన్ చేశామని చెప్పారు.
**ఉపాద్యాయుల సెలవులు,హాజరు ,విద్యార్థుల హాజరు పై సమీక్షించి సరళతరం చేస్తామని చెప్పారు.
** పదవ తరగతి నామినల్ రోల్స్ లో వచ్చిన పొరపాట్లను సరిజేసుకోవటానికి డిడిఓ లకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని కోరగా
-- ఫైనల్ మార్క్స్ లిస్ట్ వచ్చే ముందు ఒక వారం పాటు ఎడిట్ ఆప్షన్ డిడిఓ లకు ఇస్తామని తెలిపారు.
** ప్రవీణ్ ప్రకాష్ ప్రిన్సిపల్ కార్యదర్శిగా ఉన్న సందర్భంలో ఉపాధ్యాయులకు నిలుపుదల చేసిన ఇంక్రిమెంట్లను తక్షణం పునరుద్ధరించాలని కోరగా
జిల్లాల నుంచి సమాచారము వచ్చిన వెంటనే తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
*....ఈనాటి సమావేశంలో ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కె. శ్రీనివాస్ రెడ్డి గారు, జెడి సర్వీసెస్ అబ్రహం గారు, ఐటీ సెల్ అధికారులు పాల్గొన్నారు..*