• Home/
  • /
  • పదో తరగతి మూల్యాంకనంలో డిజిటల్ విప్లవం: పారదర్శకత మరియు వేగం

పదో తరగతి మూల్యాంకనంలో డిజిటల్ విప్లవం: పారదర్శకత మరియు వేగం

 *✍️ పదో తరగతి మూల్యాంకనంలో డిజిటల్ విప్లవం: పారదర్శకత మరియు వేగం*

 
*సాంకేతిక వనరులు*
- 400 ట్యాబ్లెట్ల సేకరణ
- SA ఉపాధ్యాయుల వద్ద ఉన్న ట్యాబ్లెట్లమ సేకరించి ఈ ప్రక్రియ కోసం వినియోగిస్తున్నారు.
 
*నూతన మూల్యాంకన ప్రక్రియ:*
 
*పేపర్ల దిద్దుబాటు*
- ప్రతి సహాయ పరీక్షకుడు (AE) ప్రతిరోజూ 40 నుంచి 50 జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తారు.
*ప్రాథమిక నమోదు*
- జవాబు పత్రంలోని మొదటి పేజీలో ఏ ప్రశ్నకు ఎన్ని మార్కులు వచ్చాయో నమోదు చేసి, మొత్తం మార్కులను అక్షరాల్లో రాస్తారు.
 
*ట్యాబ్ మరియు లీప్ యాప్ వినియోగం*
- ప్రతి ముఖ్య పరీక్షకుడికి (CE) ఒక ట్యాబ్ కేటాయించబడుతుంది.
- ఇందులో ఉందే 'లీప్ యాప్' ద్వారా మార్కుల వివరాలను అక్కడికక్కడే స్కాన్ చేస్తారు.
*తక్షణ ఆన్లైన్ నిక్షిప్తం*
- స్కాన్ చేసిన మార్కులు వెంటనే ఆన్లైవ్ సర్వర్లో నిక్షిప్తమవుతాయి, దీనివల్ల మాన్యువల్ డేటా ఎంట్రీ అవసరం తప్పుతుంది.
*Leap App* 
- మార్కుల నమోదు మరియు స్కానింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన అప్లికేషన్.
*ఉపాధ్యాయులకు తిరుగు అందజేత*
- మూల్యాంకనం పూర్తయిన తర్వాత, యాప్ ను  తొలగించి ట్యాబ్లెట్లను తిరిగి ఉపాధ్యాయులకు అప్పగిస్తారు.
*నూతన విధానం వల్ల ప్రయోజనాలు*
- వేగవంతమైన ఫలితాలు
- ఆన్లైన్ స్కాన్ వల్ల డేటా ప్రాసెసింగ్ సమయం తగ్గి, ఫలితాలు త్వరగా విడుదలవుతాయి.
- దోషాల నివారణ
- క్షేత్రస్థాయిలోనే (స్టాంగ్ రూమ్ వద్దే) తప్పులను గుర్తించి సరిదిద్దే అవకాశం ఉంటుంది.
- రీకౌంటింగ్ ఇబ్బందులకు చెక్
- డిజిటల్ నమోదు వల్ల మార్కుల లెక్కింపులో పొరపాట్లు తగ్గి, రీకౌంటింగ్ అవసరం ఉండదు.