• Home/
  • /
  • జ‌న‌వ‌రి 15వ తేదీ త‌ర్వాత ప్ర‌జ‌ల‌కు అన్ని సేవ‌లు ఆన్ లైన్‌లోనే అన్ని ఫైళ్లూ..ఇక ఈ-ఫైళ్లే

జ‌న‌వ‌రి 15వ తేదీ త‌ర్వాత ప్ర‌జ‌ల‌కు అన్ని సేవ‌లు ఆన్ లైన్‌లోనే అన్ని ఫైళ్లూ..ఇక ఈ-ఫైళ్లే

 *జ‌న‌వ‌రి 15వ తేదీ త‌ర్వాత ప్ర‌జ‌ల‌కు అన్ని సేవ‌లు ఆన్ లైన్‌లోనే*

 
*అన్ని ఫైళ్లూ..ఇక ఈ-ఫైళ్లే*
 
👉ఫిజిక‌ల్ పైళ్లకు స్వ‌స్తి ప‌ల‌కండి 
 
👉అన్ని సేవ‌లూ ఆన్‌లైన్‌లోనే అందించాలి
 
👉మొద‌టి ప్రాధాన్యం మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌కే
 
👉మ‌న‌మిత్ర‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచండి
 
👉సర్టిఫికెట్ల ఫిజ‌కల్ వెరిఫికేష‌న్ కూడా అవ‌స‌రం లేదు
 
👉 బ్లాక్ చైన్ టెక్నాల‌జీతో డిజీ వెరిఫై చేసేయొచ్చు
 
👉క‌లెక్ట‌ర్ల‌కు ఐటీ, ఆర్టీజీ శాఖ కార్య‌ద‌ర్శి భాస్క‌ర్ కాటంనేని సూచ‌న‌
 
 
👉జిల్లాల్లోని ప్ర‌తి ప్ర‌భుత్వ కార్యాల‌యంలోనూ ఇక‌పై ప్ర‌తి ఫైలు కూడా ఈ-ఫైలుగానే నిర్వ‌హించాల‌ని, 
 
👉జ‌న‌వ‌రి 15వ తేదీ త‌ర్వాత ప్ర‌జ‌ల‌కు అన్ని సేవ‌లు ఆన్ లైన్‌లోనే అందించ‌నున్నామ‌ని ఈ దిశ‌గా జిల్లా క‌లెక్ట‌ర్లు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఐటీ, రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ శాఖ కార్య‌ద‌ర్శి భాస్క‌ర్ కాటంనేని సూచించారు. 
 
 
👉జ‌న‌వ‌రి 15వ తేదీ నుంచి ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం అందించే సేవ‌ల‌న్నీ కూడా  ఆన్‌లైన్‌లోనే అందించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంద‌న్నారు.
 
👉త‌మ ప‌నుల కోసం  ప్ర‌జ‌లెవ్వ‌రూ ప్ర‌భుత్వ కార్యాల‌యాల చుట్టూ తిర‌గాల్సిన అవ‌స‌రం లేకుండా అన్ని సేవ‌లూ మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా అందిస్తున్నామ‌న్నారు. 
 
👉మ‌న‌మిత్ర‌ను  ప్ర‌జ‌లు స‌మ‌ర్థ‌వంతంగా వినియోగించుకుని  సుల‌భంగా సేవ‌లు పొందేలా చూడాల‌ని చెప్పారు. 
 
👉మ‌న‌మిత్ర‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించి దీని వినియోగం పెంచేలా  జిల్లాల్లో విస్తృతంగా అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌న్నారు. 
 
👉ఆయా శాఖ‌ల అధికారులు ఈ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల్లో స్వ‌యంగా పాల్గొని ఆయా శాఖ‌ల‌కు సంబంధించి సేవ‌లు వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా ఎంత సుభంగా పొంద‌వ‌చ్చో ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌న్నారు. 
 
👉వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా ప్ర‌జ‌లు ప్ర‌భుత్వం ఇచ్చే అన్ని ర‌కాల స‌ర్టిఫికెట్లు సుల‌భంగా పొంద‌వ‌చ్చ‌ని, ప్ర‌భుత్వానికి ప‌న్నులు, బిల్లుల చెల్లింపు వ‌ర‌కు అన్నీ సుల‌భంగా చేయొచ్చ‌న్నారు.