📢**ప్రశ్నలు - జవాబులు (Questions & Answers)**
*1. పిహెచ్ అలవెన్స్:*
❓ *ప్రశ్న* : పిహెచ్ అలవెన్స్ ఏ ఏ సందర్భాలలో కోత విధిస్తారు.
✅ *జవాబు* : సిఎల్ మినహా మిగిలిన సెలవులలో ఉన్న సందర్భంలో వేసవి, దసరా, సంక్రాంతి సెలవులలోను పిహెచ్ అలవెన్స్ చెల్లించరు.
*2. ఆగష్టు 15, జనవరి 26ల హాజరు*
*❓ప్రశ్న* : ఆగష్టు 15, జనవరి 26 ఉపాధ్యాయులు హాజరు పట్టీలో సంతకం చేయాలి. బయోమెట్రిక్ వేయాలి అంటున్నారు. సరియైనదేనా?
✅ *జవాబు* : అవసరం లేదు. ఆ రెండు రోజులు సెలవు దినాలు. కాబట్టి సంతకం చేయాల్సిన అవసరం లేదు. అయితే పాఠశాలలో జరిగే కార్యక్రమాలకు హాజరు కావాలి.
*3. సేవా పుస్తకంలో సెన్సూర్ (Censure)*
*❓ప్రశ్న* : ఒక ఉపాధ్యాయుని సేవా పుస్తకంలో సెన్సూర్ అని శిక్షా కాలము నమోదు చేయబడినది. దాని వివరము తెలుపగలరు.
✅ *జవాబు* : సిసిఎ నిబంధనలలో 9(i) రూల్ ప్రకారం మరియు జీఓ ఎమ్ఎస్ నం.53; తేదీ.04.02.1997 ప్రకారం సెన్సూర్ స్వల్ప దండనగా పరిగణించబడుతుంది. సెన్సూర్ వర్తించిన ఉద్యోగికి ఒక సంవత్సరం కాలం పదోన్నతులకు అర్హత ఉండదు.
*4. మెడికల్ రీయింబర్స్‌మెంట్*
*❓ప్రశ్న :* నేను ఇటీవల ఒక మగబిడ్డను ప్రసవించాను. బిడ్డను వెంటిలేషన్ పై ఉంచారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్ క్లయిమ్ చేయవచ్చా? ఎంత చెల్లిస్తారు? అలాగే నా డెలివరీ ఖర్చులను కూడా క్లయిమ్ చేయవచ్చా?
✅ *జవాబు* : చేయవచ్చు. మెడికల్ రీయింబర్స్‌మెంట్ గరిష్టంగా రెండు లక్షలవరకు చెల్లిస్తారు. జీఓ ఎమ్ఎస్ నం.74 హెల్త్ & మెడికల్, తేదీ.15.03.2005 ప్రకారం డెలివరీ ఖర్చులను కూడా క్లయిమ్ చేయవచ్చు. అయితే మీరు క్లయిమ్ చేసే ఆసుపత్రి రిఫరల్ హాస్పిటల్ అయి ఉండాలి.
*5. గృహ రుణం & వడ్డీ మినహాయింపు*
*❓ప్రశ్న :* గృహ రుణం తీసుకుని ఉన్నాను. ఇంకా ఇంటి నిర్మాణం పూర్తి కాలేదు. బ్యాంకులో ప్రతినెలా వడ్డీ చెల్లిస్తున్నాను. ఆదాయపు పన్ను మినహాయింపులో వడ్డీ చూపించుకోవచ్చా?
✅ *జవాబు* : ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం పూర్తి అయిన తర్వాతనే వడ్డీ మినహాయింపు వర్తిస్తుంది. అయితే నిర్మాణంలో ఉన్న సమయంలో చెల్లించిన వడ్డీని నిర్మాణం పూర్తి అయిన తదుపరి 5 సం॥లలో వాయిదాల ప్రకారం చూపించుకుని మినహాయింపు పొందవచ్చు.
*6. వేతన రక్షణ (Pay Protection)*
*❓ప్రశ్న* : నేను 2012 నుండి అనంతపురంలో ఎస్‌జిటిగా పని చేస్తున్నాను. రాబోవు డిఎస్‌సిలోను ఎస్‌జిటిగా గుంటూరు జిల్లాలో ఎంపిక కాబడితే నాకు వేతన రక్షణ వర్తిస్తుందా?
✅ *జవాబు* : మీరు ఉన్నతాధికారుల అనుమతితో డిఎస్‌సి పరీక్షకు హాజరైతే మీకు వేతన రక్షణ ఉంటుంది.
*7. పెన్షన్ కమ్యూటేషన్‌పై సీలింగ్*
*❓ప్రశ్న :* పెన్షన్ కమ్యూటేషన్‌పై సీలింగ్ ఉన్నదా?
జవాబు : పెన్షన్‌లో గరిష్టంగా 40% మాత్రమే కమ్యూటెడ్ చేసుకోవచ్చును. వచ్చే కమ్యూటేషన్ మొత్తంపై సీలింగ్ లేదు.
*8. పితృత్వ సెలవు & ట్యూబెక్టమీ సెలవు*
*❓ప్రశ్న* : ఒక ఉపాధ్యాయుని భార్య ప్రసవ సమయంలోనే ట్యూబెక్టమీ చేయించుకున్నారు. వారి భర్త ప్రసవ సమయంలో భార్య ట్యూబెక్టమీ చేయించున్నప్పుడు భర్తకు ఇచ్చే ప్రత్యేక సెలవు మరియు 6 నెలలోపు పెట్టు రెడ్డి లీవు రెండూ వాడుకోవచ్చా? ఒకటే వాడుకోవాలని వారి హెచ్ఎం అభ్యంతరం పెడుతు ఉన్నారు. సమంజసమేనా?
✅ *జవాబు* : భార్య ట్యూబెక్టమీ చేయించుకున్నప్పుడు భార్యకు సహాయకుడిగా ఉండేందుకు ఉద్దేశించిన సెలవు, బిడ్డకు సంరక్షణగా ఉండేందుకు ఇచ్చిన పెటర్నిటీ లీవు వేరు వేరు. ట్యూబెక్టమీ ప్రత్యేక సెలవు ఆ సమయంలోనే వాడుకోవాలి. పెటర్నిటీ లీవు ప్రసవం జరిగిన 6 నెలలలోపు వాడుకోవచ్చు. కాబట్టి రెంటింటిని వేరువేరుగా పరిగణిస్తూ, రెంటింటిని వాడుకునే అవకాశం ఉపాధ్యాయునికి కలదు.
*9. కమ్యూటెడ్ సెలవు*
*❓ప్రశ్న* : ఒక ఉపాధ్యాయిని సర్వీస్ మొత్తం మీద 260 రోజులు కమ్యూటెడ్ సెలవుగా వాడుకున్నారు. ప్రస్తుతం హెచ్ఎం 240 రోజులకు మించి వాడుకోకూడదని, అదనంగా మంజూరు చేసిన రోజులకు అర్ధజీతపు సెలవుగా పరిగణిస్తామని, ఆ మొత్తాన్ని తిరిగి కట్టాలని అంటు న్నారు. సమంజసమేనా?
✅ *జవాబు* : సమంజసమే. ఆంధ్రప్రదేశ్ సెలవు నిబంధనలు Rule 15B(i) ప్రకారం సర్వీసు మొత్తం మీద 240 రోజులు మాత్రమే కమ్యూటెడ్ చేసిన 20 రోజులను అర్ధజీతపు సెలవుగా మార్చి ఆ తేడాను రికవరీ చేస్తారు.