
📢📋 **ఉద్యోగుల e-SR పూర్తి చేయడానికి గడువు మరో నెల పొడిగింపు!**
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త! 🎉
ఉద్యోగుల సర్వీస్ రికార్డుల (e-SR) నమోదు, నవీకరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం గడువును **30-11-2026 వరకు పొడిగించింది.**
📌 **Circular Memo No.1154688, Finance (HR-IV, FR&LR) Department, తేదీ: 29-10-2026** ప్రకారం ముఖ్యమైన వివరాలు:
✅ e-SRలో భవిష్యత్తులో జరిగే అన్ని సర్వీస్ సంబంధిత మార్పులు/ఘటనలను నమోదు చేయడానికి గడువు **01-12-2026 వరకు** పొడిగించారు.
✅ ఉద్యోగులు తమ e-SRలకు సంబంధించిన అన్ని ప్రక్రియలను **31-10-2026లోపు** పూర్తి చేయాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించి, ఇప్పుడు **30-11-2026లోపు** పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది.
✅ సర్వర్ సమస్యలు, OTP ధృవీకరణలో ఇబ్బందులు, సాంకేతిక సమస్యలు, సర్వీస్ వివరాలు మరియు సంబంధిత ధ్రువపత్రాలు సేకరించడంలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ఈ గడువు పొడిగించారు.
📣 **ఉద్యోగులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని, తమ e-SR నమోదు మరియు నవీకరణ ప్రక్రియను 30-11-2026లోపు పూర్తి చేసుకోవాలెను. 🙏🏻