📢 అన్ని AMOs గారికి ముఖ్య సమాచారం
✅ 1–2 తరగతులు మరియు 3–5 తరగతుల కోసం ఎంపికైన KRPల జాబితా పంపించబడింది.
✅ 1–2 తరగతుల కోసం మొత్తం 156 మంది KRPలు (ప్రతి జిల్లాకు 6 మంది చొప్పున) 18-05-2026 నుండి 22-05-2026 వరకు మొత్తం 5 రోజులపాటు విజయవాడలో శిక్షణ పొందనున్నారు.
✅ 3–5 తరగతుల కోసం మొత్తం 156 మంది KRPలు (ప్రతి జిల్లాకు 6 మంది చొప్పున) 18-05-2026 నుండి 21-05-2026 వరకు మొత్తం 4 రోజులపాటు విజయవాడలో శిక్షణ పొందనున్నారు.
✅ ఈ విషయాన్ని సంబంధిత MEOలకు వెంటనే తెలియజేయాలని అన్ని AMOs గారిని కోరడమైనది.
✅ అలాగే, ఎంపికైన ఉపాధ్యాయులను KRP శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యేలా సంబంధిత ప్రధానోపాధ్యాయులకు సూచనలు ఇవ్వగలరు.
✅ అధికారిక అనుమతి ఉత్తర్వులు (Proceedings) త్వరలో పంపించబడతాయి.
✅ అప్పటివరకు సంబంధిత ఉపాధ్యాయులకు ముందస్తుగా సమాచారం అందించి, అవసరమైన ఏర్పాట్లు చేసుకునేలా చూడగలరు.
🙏 ధన్యవాదాలు.