*AP ప్రభుత్వ ఉద్యోగులకు అత్యంత ముఖ్యమైన సమాచారం*
01-08-2026 నుండి NIDHI Portal ద్వారా e-SR (Electronic Service Register) అమలు
G.O.Ms.No.57, Finance (HR-IV, FR&LR) Department, Dt: 20-07-2026
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన G.O.Ms.No.57 ప్రకారం, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉద్యోగులు తమ సర్వీస్ రికార్డును (Service Register) ఇకపై NIDHI Portal ద్వారా నిర్వహించాల్సి ఉంటుంది.
*ముఖ్యమైన తేదీలు:*
✅ 01-08-2026 నుండి NIDHI Portal లో e-SR నమోదు ప్రారంభం.
✅ 31-08-2026 లోపు అన్ని ఉద్యోగుల e-SR నమోదు పూర్తి చేయాలి.
✅ 01-09-2026 నుండి అన్ని Service Events పూర్తిగా NIDHI Portal ద్వారానే నమోదు అవుతాయి.
*HOO / DDO తప్పనిసరిగా చేయాల్సిన పనులు:*
01-08-2026 లోపు ప్రతి ఉద్యోగి Physical Service Register పూర్తిగా పరిశీలించాలి.
✔️ ప్రతి Entry సరిగా ఉందో లేదో ధృవీకరించాలి.
✔️ 31-07-2026 వరకు రావలసిన అన్ని Entries నమోదు చేయాలి.
✔️ మొత్తం Service Register ను Scan చేసి ఒకే PDF File గా సేవ్ చేయాలి.
తప్పనిసరిగా పరిశీలించాల్సిన Service Entries
ప్రతి ఉద్యోగి Service Register లో ఈ వివరాలు పూర్తిగా ఉన్నాయో లేదో తనిఖీ చేయాలి.
1️⃣ Appointment
2️⃣ Regularization
3️⃣ Probation Declaration
4️⃣ Change in Pay
5️⃣ Leaves Availed
6️⃣ Transfers
7️⃣ Promotions
8️⃣ Deputation
9️⃣ Reversion
🔟 Compulsory Wait
1️⃣1️⃣ Punishments
1️⃣2️⃣ Suspensions
1️⃣3️⃣ Relief
1️⃣4️⃣ Re-Appointment
1️⃣5️⃣ EL Surrender
1️⃣6️⃣ Repatriation / Surrender
1️⃣7️⃣ Re-instatement
1️⃣8️⃣ Reporting Back to Duty
1️⃣9️⃣ Regularisation of Absence
2️⃣0️⃣ Others (No Impact on Pay)
Service Register Scan చేసే విధానం
ఒక ఉద్యోగికి ఒకటి కంటే ఎక్కువ Service Books ఉంటే...
➡️ మొదటి Book
➡️ తరువాత రెండవ Book
➡️తరువాత మూడవ Book
అన్నింటినీ వరుసగా Scan చేసి ఒకే PDF File తయారు చేయాలి.
Page Number నమోదు ఎలా చేయాలి?
e-SR నమోదు సమయంలో "Ref. Page No. in Scanned SR Copy" లో
స్కాన్ చేసిన PDF పేజీ నంబర్లనే నమోదు చేయాలి.
Service Register పుస్తకంలోని అసలు పేజీ నంబర్లు నమోదు చేయకూడదు.
*01-09-2026 నుండి ముఖ్యమైన మార్పు:*
NIDHI Portal లో ఏ Service Event జరిగినా...
ఉదాహరణకు...
Increment
Promotion
Transfer
Pay Revision
Leave
ఇతర Service Events
అవి ఆటోమేటిక్‌గా e-SR లో నమోదు అవుతాయి.
అందువల్ల గత తేదీలతో (Back Date) ఎలాంటి Entry చేయకూడదు.
*PART–1 Personal Details గురించి*
PART–1 Personal Details ను e-SR లో నమోదు చేసే అవకాశం ఉండదు.
ఈ వివరాలను ఉద్యోగి తన NIDHI Portal → ESS Services → Update Personal Information ద్వారా నమోదు చేయాలి.
*Document Upload:*
Personal Information Update చేసినప్పుడు...
▪️ సంబంధిత Supporting Documents కూడా Upload చేయాలి.
*Family & Nomination Approval*
ఉద్యోగి నమోదు చేసిన...
Family Details
Nomination Details
సంబంధిత HOO/DDO Login లోని
"Approve Family and Nomination Details" Module ద్వారా ఆమోదించాలి.
ఆమోదించిన తర్వాత మాత్రమే ఆ సమాచారం e-SR లోకి వెళుతుంది.
*అధికారులు వెంటనే చేయాల్సిన పనులు*
▪️అన్ని ఉద్యోగుల Service Registers పరిశీలించాలి.
▪️ పెండింగ్ Service Entries పూర్తి చేయాలి.
▪️ అన్ని Service Books Scan చేసి ఒకే PDF తయారు చేయాలి.
▪️ PDF పేజీలకు వరుస సంఖ్యలు ఇవ్వాలి.
▪️ ESS ద్వారా Personal Information Update చేయించాలి.
▪️ Family & Nomination వివరాలను HOO/DDO ఆమోదించాలి.
▪️ 31-08-2026 లోపు మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలి.
*అత్యవసర సూచన:*
అన్ని Drawing & Disbursing Officers (DDOs), Heads of Offices (HOOలు) మరియు ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని, 31-08-2026 లోపు e-SR సిద్ధం చేసి, 01-09-2026 నుండి NIDHI Portal ద్వారా పూర్తి స్థాయి డిజిటల్ సర్వీస్ రిజిస్టర్ నిర్వహణకు సిద్ధంగా ఉండాలని ఉప ఖజానా (Sub Treasury) అధికారులు సూచించారు.