• Home/
  • /
  • Flash.. Teachers Work Adjustment Surplus Teachers Details Released ▪️ Surplus టీచర్ల లిస్ట్ విడుదల. ▪️ జూన్ 30 రోల్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 7129 మిగులు ఉపాధ్యాయులుగా గుర్తింపు

Flash.. Teachers Work Adjustment Surplus Teachers Details Released ▪️ Surplus టీచర్ల లిస్ట్ విడుదల. ▪️ జూన్ 30 రోల్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 7129 మిగులు ఉపాధ్యాయులుగా గుర్తింపు

 🅰️🅿️ *Flash.. Teachers Work Adjustment Surplus Teachers Details Released*

 
▪️ *Surplus టీచర్ల లిస్ట్ విడుదల.*
▪️ *జూన్ 30 రోల్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 7129 మిగులు ఉపాధ్యాయులుగా గుర్తింపు*
 
అందరు మండల విద్యాశాఖాధికారులకు తెలియజేయడమైనది ఏమనగా,
 
మీ లాగిన్‌లో Surplus/Deficit జాబితాలు అందుబాటులోకి వచ్చాయి. Surplus జాబితాలో సంబంధిత ఉపాధ్యాయుల పేర్లు కూడా ప్రదర్శించబడుతున్నాయి.
 
అయితే, టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (TIS) లో నమోదైన డేటా ఆధారంగా లేదా ఇతర కారణాల వల్ల, కొన్నిచోట్ల జూనియర్ల కంటే సీనియర్లు Surplus‌గా కనిపించడం, అలాగే కొంతమంది ఉపాధ్యాయుల వివరాల్లో చిన్నచిన్న పొరపాట్లు ఉన్నట్లు గమనించబడింది.
 
ఈ వివరాలను సరిదిద్దేందుకు MEO Login మరియు District Office Loginలలో త్వరలో Correction Option అందుబాటులోకి తీసుకురాబడుతుంది. ఆ ఆప్షన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే సంబంధిత వివరాలను సరిచేసుకోవచ్చు.
 
డేటా సవరణలు పూర్తయిన అనంతరం Surplus జాబితాలు కూడా సవరించబడతాయి. తద్వారా, నిబంధనల ప్రకారం అర్హత కలిగిన సీనియర్ ఉపాధ్యాయుడు సిద్ధపడి (Willingness) ఉంటే వారి పేరు, లేకపోతే తదుపరి అర్హత కలిగిన జూనియర్ ఉపాధ్యాయుని పేరు పరిగణనలోకి వస్తుంది.
 
కాబట్టి, ప్రస్తుతం కనిపిస్తున్న జాబితాల గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అవసరమైన డేటా సవరణలకు అవకాశం కల్పించిన తరువాత, మొత్తం డేటాను పరిశీలించి, శుద్ధి చేసిన అనంతరమే తదుపరి ప్రక్రియ చేపట్ట బడుతుంది.
 
🍁🍁🍁🍁🍁🍁
 
*క్యాడర్ విభజన*
 
మనకు నచ్చినా నచ్చకపోయినా, ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చేలా ఉన్నా, ఉద్యమాలు చేసినా కూడా స్థానికత ఆధారం గా కేటాయింపులు జరగవు. 
 
ఒకవేళ అలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా అవి చెల్లుబాటు కావు. రాష్ట్రం లో ఉన్న ఏ ఉద్యోగి, నిరుద్యోగి కోర్టు ను ఆశ్రయించినా అవి రద్దు అవుతాయి. 
 
ఏ నిష్పత్తిలో పోస్టులను  పంచుతారో, అదే నిష్పత్తిలో ఉద్యోగులను పంచుతారు, అదే నిష్పత్తిలో ఖాళీలను పంచుతారు. 
 
సీనియారిటీ ప్రాతిపదికన మాత్రమే ఆప్షన్స్ ని కన్సిడర్ చేస్తారు. 
 
ఇంతకు మించి ప్రభుత్వం కూడా చేయడానికి ఎలాంటి అవకాశం లేదు. 
 
మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా అంగీకరించవలసిన చేదు నిజం ఇది.
 
🍁🍁🍁🍁🍁🍁