• Home/
  • /
  • పత్రికా ప్రకటన * ఆంధ్రప్రదేశ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP DEECET-2026) పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ డి.ఎల్.ఎడ్. కళాశాలలలో ప్రవేశాల నిమిత్తం 14.07.2026 నుండి 18.07.2026 వరకు వెబ్ ఆధారిత (Web-B

పత్రికా ప్రకటన * ఆంధ్రప్రదేశ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP DEECET-2026) పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ డి.ఎల్.ఎడ్. కళాశాలలలో ప్రవేశాల నిమిత్తం 14.07.2026 నుండి 18.07.2026 వరకు వెబ్ ఆధారిత (Web-B

 🅰️🅿️

 
         *పత్రికా ప్రకటన*
* ఆంధ్రప్రదేశ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP DEECET-2026) పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ డి.ఎల్.ఎడ్. కళాశాలలలో ప్రవేశాల నిమిత్తం 14.07.2026 నుండి 18.07.2026 వరకు వెబ్ ఆధారిత (Web-Based) ఆప్షన్లు నమోదు చేసుకొనుటకు అవకాశం కల్పించ బడినది.
* అభ్యర్ధులు నమోదు చేసిన వెబ్ ఆప్షన్ల ఆధారంగా 20.07.2026 నుండి 23.07.2026 వరకు సీట్ల కేటాయింపు (Seat Allotment) నిర్వహించ బడును. సీట్లు కేటాయించ బడిన అభ్యర్థులు తమ తాత్కాలిక ప్రవేశ పత్రాలను (Provisional Admission Letters) అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకో వచ్చును.
* సీట్లు కేటాయించ బడిన అభ్యర్ధులు 24.07.2026 నుండి 29.07.2026 వరకు సంబంధిత ప్రభుత్వ డైట్ (DIET) కళాశాలలలో తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించి, ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది ప్రవేశ పత్రం (Final Admission Letter) పొంద వలెను.
* డి.ఎల్.ఎడ్. మొదటి సంవత్సరం తరగతులు 30.07.2026 నుండి ప్రారంభ మగును.
* కావున, అర్హత సాధించిన అభ్యర్థులందరూ నిర్ణీత షెడ్యూల్ ప్రకారం వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకొని, సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరై, తమకు కేటాయించిన కళాశాలలో నిర్ణీత గడువులోగా ప్రవేశం పొందవలసిందిగా శ్రీ బి. లింగేశ్వర రెడ్డి, రాష్ట్ర కన్వీనర్, AP DEECET-2026 & ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, పాఠశాల విద్య, గుంటూరు వారు ఒక ప్రకటనలో తెలిపారు.
 
                 *కన్వీనర్*
*DEECET-2026 & ప్రాంతీయ సంయుక్త సంచాలకులు,* 
    *పాఠశాల విద్య, *గుంటూరు.*