• Home/
  • /
  • AP SSC 2027 Action Plan Schedule, అన్ని సబ్జెక్ట్స్ యాక్షన్ ప్లాన్ మెటీరియల్

AP SSC 2027 Action Plan Schedule, అన్ని సబ్జెక్ట్స్ యాక్షన్ ప్లాన్ మెటీరియల్

 AP SSC 2027 Action Plan Schedule, అన్ని సబ్జెక్ట్స్ యాక్షన్ ప్లాన్ మెటీరియల్.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ

పత్రికా ప్రకటన (12.7.26)
 
 
 
 
 
 
 
 
*🎯పదో తరగతిలో 100% ఉత్తీర్ణత సాధనకు పాఠశాల విద్యాశాఖ ప్రతిష్టాత్మక అడుగు: "మిషన్ మార్చ్ SSC-2027" కార్యాచరణ ప్రారంభం*
 
*అమరావతి:*
 
ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడానికి మరియు ఎస్ఎస్‌సీ (SSC) పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖ "మిషన్ మార్చ్ SSC–2027: నూటికి నూరు శాతం విజయమే లక్ష్యం – యాక్షన్ ప్లాన్ ఫేజ్-I" (Mission March SSC–2027: A Leap Towards 100% Success – Action Plan Phase-I)* ను ప్రారంభించింది.
 
ఈ ప్రత్యేక కార్యక్రమం జాతీయ విద్యా విధానం (NEP-2020), జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం (NCF-2023) మార్గదర్శకాలకు అనుగుణంగా, ఎన్‌సీఈఆర్‌టీ (NCERT) కి చెందిన 'పరాఖ్' (PARAKH) సంస్థ సిఫార్సు చేసిన సామర్థ్య ఆధారిత విశ్లేషణ విధానానికి (Competency-based assessment framework) అనుగుణంగా రూపొందించబడింది.
 
*కార్యక్రమ ముఖ్య విశేషాలు:*
 
* ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో *13 జూలై 2026 నుండి 30 నవంబర్ 2026 వరకు అమల్లో ఉంటుంది.
* *ప్రత్యేక సమయం:* పాఠశాల పని దినాల్లో రోజు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు ప్రత్యేక విద్యా మద్దతు సెషన్ (Academic support session) నిర్వహిస్తారు. ఇందులో సబ్జెక్టుల పునర్విమర్శ (Revision) మరియు సామర్థ్య ఆధారిత స్లిప్ టెస్ట్‌లు (Slip Tests) ఉంటాయి.
* *డిజిటల్ మద్దతు (లీప్ యాప్):* ప్రభుత్వ పరీక్షల బోర్డు (BSE) ఈ కార్యక్రమానికి సంబంధించి రోజువారీ షెడ్యూల్స్, క్వశ్చన్ బ్యాంకులు, స్టడీ మెటీరియల్ మరియు స్లిప్ టెస్ట్‌లను ప్రత్యేకంగా రూపొందించిన LEAP App, BSE వెబ్ సైట్లో పొందుపరచడం జరుగుతుంది. 
* వైవిధ్యభరిత బోధనా పద్ధతి
 (Differentiated Learning):** విద్యార్థుల స్థాయిని బట్టి రెండు విభాగాలుగా బోధన సాగుతుంది:
1. *రైజింగ్ స్టార్స్ (లెవెల్–1):* కనీస అభ్యసన నైపుణ్యాలు మరియు పునాదిని బలోపేతం చేయడం కోసం.
2. *షైనింగ్ STARS (లెవెల్–2):* ప్రతిభావంతులైన విద్యార్థుల్లో ఉన్నత స్థాయి సామర్థ్యాలను పెంపొందించడం కోసం.
 
 
* *ఉపాధ్యాయుల పాత్ర:* ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, వెనుకబడిన వారికి ప్రత్యేక బోధన (Remedial support) అందిస్తారు. అలాగే ప్రతిభావంతులకు తగిన మార్గదర్శకత్వం చేస్తూ ప్రగతి రికార్డులను క్రమబద్ధంగా నమోదు చేస్తారు.
* *నిరంతర పర్యవేక్షణ:* ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు కావడానికి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు (Headmasters) మరియు విద్యాశాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారు.
 
> "విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి, వారిని రేపటి సవాళ్లకు సిద్ధం చేసేందుకే ఈ సామర్థ్య ఆధారిత అభ్యసన కార్యక్రమాన్ని తీసుకువచ్చాం" అని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా IAS., గారు పేర్కొన్నారు.
 
రాబోయే *SSC పబ్లిక్ పరీక్షలు–2027* లో ప్రతి పదో తరగతి విద్యార్థి అత్యుత్తమ విజయం సాధించేలా... ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యా రంగానికి చెందిన భాగస్వాములందరూ ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని విజయవంతం చేయాలని విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది.
 
 
*డైరెక్టర్ (ప్రభుత్వ పరీక్షల విభాగం) & కార్యదర్శి,*
 
*సెకండరీ విద్యా బోర్డు, ఆంధ్రప్రదేశ్.*