ఉపాధ్యాయ సంఘాలతో CSE సమావేశంలో.....CSE MEETING WITH TEACHERS UNION ON 5-6-2026 UPDATES.
*🎯ఉపాధ్యాయ సంఘాలతో CSE సమావేశంలో.....*
👉జనరల్ టెట్ నోటిఫికేషన్ ఈరోజు విడుదల అవుతుందని, ఉపాధ్యాయులకు ప్రత్యేక TET నిర్వహించడానికి విద్యా మంత్రి గారు సానుకూలంగా ఉన్నారని, త్వరలోనే దానికి సంబంధించిన విధివిధానాలను విడుదల చేస్తామని కమిషనర్ గారు తెలియజేశారు...
👉 MEO 1,2 పోస్టులు అన్నిటిని రద్దు చేయాలని, ఓన్లీ ఎంఈఓ పోస్ట్ గానే చూపాలని, దీన్ని జోనల్ పోస్టులో పెట్టాలనె ఆలోచన.
👉 ప్రస్తుతం గవర్నమెంట్ ,జిల్లా పరిషత్, మున్సిపల్, నగరపాలక సంస్థల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయుల పోస్టులన్నింటినీ జోనల్ పోస్ట్ గా చూపాలని GAD వారు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు, సంఘాల అభిప్రాయం ను అడిగారు.
👉
పదవ తరగతి సోషల్ సిలబస్ చాలా ఎక్కువగా ఉందని, దీనిని అర్థం చేసుకోవడానికి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, తక్షణం 22 చాప్టర్స్ గా ఉన్న సోషల్ సిలబస్ లో కనీసం ఐదు చాప్టర్స్ అయినా తగ్గించి పని ఒత్తిడిని ఉపాధ్యాయులకు తగ్గించాలని సంఘాలు కోరగా,
SCERT వారితో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ కమిషనర్ గారు తెలిపారు.
👉
2026 మే 31 ఆధారంగా వర్క్ అడ్జెస్ట్మెంట్ , విద్యా ఇన్స్పెక్టర్స్ ను నియమిస్తామని చెప్పారు.
-- తక్షణం అడ్జెస్ట్మెంట్ అవసరమని, అందువల్ల మే 31 రోల్ ఆధారంగా వర్క్ అడ్జెస్ట్మెంట్ చేస్తామని, అవసరమయితే జూన్ 30 రోల్ ఆధారంగా మరొకసారి అడ్జస్ట్మెంట్ చేస్తామని తెలిపారు.
👉
జూన్ 10నాటి Roll ఆధారంగా...విద్యార్థుల సంఖ్య 60 ఉంటే మోడల్ ప్రైమరీ గా కన్వర్ట్ చేసి ఉపాధ్యాయులను సర్దుబాటు చెయ్యాలని సూచించిన విద్యాశాఖ.
ప్రతి ఉపాద్యాయులకు టెస్ట్ బుక్ టేబుల్ కాపీని ఇవ్వడానికి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు..