• Home/
  • /
  • ఉద్యోగుల సర్దుబాటు మార్గదర్శకాల జారీకి జీఏడీ కసరత్తు 🌷విభాగాల వారీగా సిబ్బంది కేటాయింపునకు చర్యలు

ఉద్యోగుల సర్దుబాటు మార్గదర్శకాల జారీకి జీఏడీ కసరత్తు 🌷విభాగాల వారీగా సిబ్బంది కేటాయింపునకు చర్యలు

 ఉద్యోగుల సర్దుబాటు మార్గదర్శకాల జారీకి జీఏడీ కసరత్తు 

 
🌷విభాగాల వారీగా సిబ్బంది కేటాయింపునకు చర్యలు
 
🌷ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్-2025కు అనుగుణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల సర్దుబాటుకు మార్గదర్శకాలు విడుదల చేసేందుకు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గెజిట్లో నోటిఫై చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఉన్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలు, ఆరు జోన్లు, రెండు మల్టీ జోన్ల ప్రాతిపదికన ఉద్యోగుల సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. దీనికి అనుసరించాల్సిన విధానాలకు సంబంధించి జీఏడీ మార్గదర్శకాలు విడుదల చేస్తే.. అన్ని విభాగాలు బదిలీలు, సర్దుబాటు, పదో న్నతులకు చర్యలు తీసుకుంటాయి. ఉద్యోగుల సర్దుబాటుకు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించేందుకు నోడల్ అధికారులను నియమించాలని జీఏడీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. నోడల్ అధికారుల వివరాలను కొన్ని విభాగాలు ఇప్పటికే జీఏడీకి సమర్పించాయి. అన్ని శాఖలు, విభాగాల ఉద్యోగుల వివరాలను ఈ-హ్యూమన్ రిసోర్సు మాస్టర్ (ఈ-హెన్ఆర్ఎం) ద్వారా ఆన్లైన్లో తీసుకున్నారు.👆