• Home/
  • /
  • రాష్ట్రంలో విలీన గ్రామపంచాయితీలు.. కీలక ఉత్తర్వులు జారీ

రాష్ట్రంలో విలీన గ్రామపంచాయితీలు.. కీలక ఉత్తర్వులు జారీ

 

రాష్ట్రంలో విలీన గ్రామపంచాయితీలు.. కీలక ఉత్తర్వులు జారీ
 
▪️మున్సిపాలిటీల్లో విలీనం చేసిన 112 గ్రామ పంచాయతీల కారణంగా ప్రభావితమైన మండల ప్రజా పరిషత్‌లను, వాటి పరిధిలో మిగిలిన గ్రామ పంచాయతీలతో తిరిగి ఏర్పాటు చేసినట్లుగా పరిగణిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
▪️విలీనం కారణంగా ప్రభావితమైన మండల ప్రజా పరిషత్‌లను, వాటి పరిధిలో మిగిలి ఉన్న గ్రామ పంచాయతీలతో తిరిగి ఏర్పాటు చేసినట్లుగా పరిగణించాలని ప్రభుత్వం ప్రకటించింది.
▪️ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం, 1994లోని సెక్షన్ 148(3) ప్రకారం ఈ చర్య చేపట్టారు.
▪️ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 01-10-2026న W.A.No.1063/2026 మరియు సంబంధిత కేసుల్లో ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది.
▪️జీవో అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.