📢 **జూన్ 1 నుంచి రీ-వాల్యుయేషన్ పోర్టల్ (సీబీఎస్‌ఈ ప్రకటన)**
సమాధాన పత్రాల రీ-వాల్యుయేషన్, వెరిఫికేషన్‌కు సంబంధించిన పోర్టల్ **జూన్ 1** నుంచి అందుబాటులోకి వస్తుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ప్రకటించింది. విద్యార్థులకు పారదర్శక, లోపాలు లేని ప్రక్రియను అందించడమే ఈ నిర్ణయం యొక్క ముఖ్య లక్ష్యం.
▪️ **సహాయం కోసం:** విద్యార్థులకు ఏవైనా సందేహాలు ఉంటే కింది మార్గాల ద్వారా సీబీఎస్‌ఈని సంప్రదించవచ్చు:
▪️ **హెల్ప్‌లైన్ నంబరు:** 1800 11 8004
▪️**నేపథ్యం:** ఆన్‌స్క్రీన్ మార్కింగ్ (OSM) విధానంపై కొందరు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఓఎస్‌ఎం విధానంలో సమాధాన పత్రాలు తారుమారైనట్లు దాదాపు 20 కేసులు నమోదయ్యాయి.
▪️ **స్కానింగ్ లోపాలు:** మొత్తం 98 లక్షల సమాధాన పత్రాల్లో దాదాపు 68 వేల పత్రాల్లో నాణ్యతా లోపాలు ఉన్నట్లు స్కానింగ్ సమయంలో వెల్లడైంది. దీంతో సుమారూ 13 వేల జవాబు పత్రాలను సిబ్బందితో మాన్యువల్‌గా (చేత్తో) మూల్యాంకనం చేయించాల్సి వచ్చింది.