• Home/
  • /
  • జిల్లా సమగ్ర శిక్ష అధికారులు ఇప్పుడే తెలియజేసిన సమాచారం మేరకు, గతంలో పాఠశాల గ్రాంటు, కాంప్లెక్స్ గ్రాంటు మరియు MRC గ్రాంటుల కోసం యూనియన్ బ్యాంక్‌లో PFMS అకౌంట్లు ప్రారంభించడం జరిగింది.

జిల్లా సమగ్ర శిక్ష అధికారులు ఇప్పుడే తెలియజేసిన సమాచారం మేరకు, గతంలో పాఠశాల గ్రాంటు, కాంప్లెక్స్ గ్రాంటు మరియు MRC గ్రాంటుల కోసం యూనియన్ బ్యాంక్‌లో PFMS అకౌంట్లు ప్రారంభించడం జరిగింది.

 ప్రధానోపాధ్యాయులందరికీ శుభ సాయంత్రం 🙏

 
జిల్లా సమగ్ర శిక్ష అధికారులు ఇప్పుడే తెలియజేసిన సమాచారం మేరకు, గతంలో పాఠశాల గ్రాంటు, కాంప్లెక్స్ గ్రాంటు మరియు MRC గ్రాంటుల కోసం యూనియన్ బ్యాంక్‌లో PFMS అకౌంట్లు ప్రారంభించడం జరిగింది.
 
ప్రస్తుతం గ్రాంట్లను విడుదల చేయడానికి SNA-SPARSH విధానం అమల్లోకి వస్తున్నందున, గతంలో ఉపయోగించిన PFMS బ్యాంక్ అకౌంట్లను క్లోజ్ చేయాలని రాష్ట్ర అధికారులు మెమో ద్వారా ఆదేశాలు జారీ చేశారు.
 
✅ కాబట్టి ప్రతి ప్రధానోపాధ్యాయుడు తమ పాఠశాలకు సంబంధించిన పాత PFMS అకౌంట్లను తప్పనిసరిగా క్లోజ్ చేయాలి.
 
✅ పాత PFMS అకౌంట్ క్లోజ్ చేసిన తర్వాతనే కొత్త SNA-SPARSH విధానంలో గ్రాంట్లు జమ చేయడానికి అవకాశం ఉంటుంది.
 
✅ కావున ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయడం చాలా ముఖ్యమైనది. ఆలస్యం జరిగితే కొత్త గ్రాంట్ల విడుదలలో కూడా ఆలస్యం జరిగే అవకాశం ఉంది.
 
🏦 బ్యాంక్ అకౌంట్ క్లోజింగ్ కోసం
 
ఈ మెసేజ్‌తో పాటు బ్యాంక్ మేనేజర్‌కు ఇవ్వాల్సిన Request Letter కూడా పంపిస్తున్నాము.
 
ప్రధానోపాధ్యాయులు:
 
✅ మీ పాఠశాల వివరాలు
✅ బ్యాంక్ అకౌంట్ నంబర్
✅ అవసరమైన ఇతర వివరాలు నమోదు చేసి
✅ ప్రధానోపాధ్యాయుల సంతకం మరియు పాఠశాల సీల్ వేసి
 
సంబంధిత యూనియన్ బ్యాంక్ బ్రాంచ్‌లో సమర్పించి పాత PFMS అకౌంట్‌ను క్లోజ్ చేయించగలరు.
 
🔴 కావున ప్రధానోపాధ్యాయులందరూ ఈ ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, వీలైనంత త్వరగా పాత PFMS అకౌంట్లను క్లోజ్ చేయించగలరు.
 
🙏 ధన్యవాదాలు.