• Home/
  • /
  • 25-5-2025 న మంగళగిరి డైరెక్టర్ కార్యాలయంలో జరిగిన చర్చలలో డైరెక్టర్ గారి సమావేశం చర్చల సారాంశం.

25-5-2025 న మంగళగిరి డైరెక్టర్ కార్యాలయంలో జరిగిన చర్చలలో డైరెక్టర్ గారి సమావేశం చర్చల సారాంశం.

 25-5-2025 న మంగళగిరి డైరెక్టర్ కార్యాలయంలో జరిగిన చర్చలలో డైరెక్టర్ గారి సమావేశం చర్చల సారాంశం.

 
1.Request transfer విషయంలో విరమించుకోదలచుకున్నవారు ప్రస్తుతం పనిచేసే ఒక్క ప్లేస్ తప్పనిసరిగా ఆప్ట్ చేసుకోవాలి.
 
2.Language pandits (L.Ps) కు న్యాయం చేస్తారు. వారికి శాశ్వత ప్రాతిపదికన  పదోన్నతులు ఇస్తారు. కొంచె అటుయిటుగా తగు చర్యలు తీసుకుంటారు.
 
3.గుంటూరు జిల్లాలో up (Urdu) schoolsలో SA (Urdu) పోస్ట్ అలాట్మెంట్ కు అంగీకారం. Model primary schools (Urdu)లో SA (Urdu) లను HM గా అలాట్ చేయడానికి పరిశీలనకు అంగీకరించారు
 
4.పదోన్నతులలో SC వర్గీకరణ అమలు విషయంలో adequacy విషయంలో  డిఈఓ లకు సూచనలు ఇస్తారు.
 
5.Inter management 8సంవత్సరాలు పూర్తి కాకుండా request transfer కోరుకున్నప్పుడు అవకాశం ఉంటే పేరెంట్ మేనేజ్మెంట్ కు వెళ్ళవచ్చు. బదిలీ రాకపోతే ప్రస్తుతం పనిచేస్తున్న యాజమాన్యంలో కొనసాగవచ్చు. మన ప్రతిపాదన పరిశీలిస్తామన్నారు.
 
6.MEOలకు విడిగా పదోన్నతులు లేవు కాబట్టి HMగా పదోన్నతులు పొందినవారినుంచే  MEO లుగా వెళ్ళడానికి అవకాశం ఇస్తున్నారు. కాబట్టి adequacy కి MEO - HM ఒకే క్యాడర్ గా పరిగణిస్తారు. గతంలో MEOకి నేరుగా పదోన్నతులు ఉండేవి. ఇప్పుడు MEOలకు నేరుగా పదోన్నతులు లేవు , HMలే MEOలుగా వెళుతున్నారు కాబట్టి HM/MEOకలిపి ఒకే క్యాడర్ గా adequacy చూస్తున్నారు.
 
7. SGT లకు మాన్యవల్ కౌన్సిలింగ్ లేదా వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ విషయంలో ఒక వీడియో విడుదల చేస్తారు.  ఉపాద్యాయులు సంతృప్తి చెందితే వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు , లేదా ఉపాద్యాయులు అంగీకరించని పక్షంలో మాన్యువల్ కౌన్సిలింగ్ ఉంటుంది. 
 
8. వెబ్ కౌన్సిలింగ్ లో క్లష్టర్ వారీగా మండలం కేంద్రం నుండి పర్టీకులర్ స్కూల్ కు కి.మీ. లో దూరాన్ని ప్లేస్ పక్కనే సూచిస్తారు.