Teachers, అందరకీ గమనిక:*
*Online DIKSHA courses- Mandatory*
*DIKSHA 2.0 లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, జాతీయ విద్యా విధానం (NEP) 2020 ఆదేశాలకు అనుగుణంగా, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు మరియు మండల, జిల్లా స్థాయి అధికారులు ఒక విద్యా సంవత్సరానికి 50 గంటల శిక్షణ పూర్తి చేయవలసి ఉంటుంది. ఇది తప్పనిసరి ప్రక్రియ. మనకు రాదు అనడానికి వీలు లేదు. కేవలం లీప్ యాప్ ద్వారా దీక్షా ద్వారా కోర్సు లు పూర్తి చేసి తీరాలి.*
కావున ఈ రోజు క్లస్టర్ మీటింగ్ లో రాష్ట్ర కార్యాలయం వారు దీక్షా యాప్, దీక్షా కోర్సెస్ లో ఏ విధముగా login అవ్వాలి, ఎలా merge చెయ్యాలి, తదుపరి ఆన్లైన్ కోర్సెస్ పూర్తి చేయు విధానం గురించి వివరంగా తెలియచేయడం జరుగుతుంది.
ఈ నెలలో దీక్షా ద్వారా చెయ్యవలసిన కోర్సు వివరాలు:
*NISHTHA FLN 3.0*: కొత్తగా మెగా DSC ద్వారా నియమించబడిన SGTs, 1 నుండి 5 వ తరగతి వరకు బోధిస్తున్న ఉపాధ్యాయులు అందరూ, ప్రాధమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు దీక్షా కోర్సెస్ అప్ ద్వారా 12 modules ను పూర్తి చేయవలసి ఉంటుంది.
*NISHTHA 4.0*:
MEOs, DIET Faculty, CRPs, CDPOs, AWWs లు దీక్షా కోర్సెస్ అప్ ద్వారా 6 modules పూర్తి చేయవలసి ఉంటుంది.
*Career guidance*:
ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్స్ అందరూ దీక్షా యాప్ ద్వారా 5 modules ను పూర్తి చేయవలసి ఉంటుంది.
*Competency Based Assessment*: జిల్లాలో ఉన్న అన్ని కేటగిరీ లకు చెందిన HMs, SGTs, SAs దీక్షా యాప్ ద్వారా ఈ కోర్సు పూర్తి చేయవలసి ఉంటుంది.
*ఙ్ఞాన ప్రకాశ్ - 60 రోజుల శిక్షణా కార్యక్రమం:* జ్ఞాన ప్రకాష్ మొదటి సంవత్సరం శిక్షణ తీసుకున్న ప్రాధమిక పాఠశాలల ఉపాధ్యాయులు అందరూ దీక్షా యాప్ ద్వారా 4 modules పూర్తి చేయవలసి ఉంటుంది.
*TPD Science course:*
UP, High Schools లో Physics మరియు Biology బోధిస్తున్న School Assistants అందరూ ఈ కోర్సు పూర్తి చేయవలసి ఉంటుంది .
గమనిక: ఇక మీదట టీచర్స్ కి ఇవ్వవలసిన శిక్షణ అంతా దీక్షా యాప్ ద్వారా నే ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైన ప్రక్రియ. విద్యా శాఖలో పనిచేస్తున్న ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, వారికి సంబంధించిన శిక్షణ పూర్తి చేసుకోవడం తప్పనిసరి. ప్రతీ MEO/ HM/Teacher కనీసం 50 గంటలు తప్పనిసరిగా శిక్షణ తీసుకోవలసి ఉంటుంది. కావున అందరూ జాగ్రత్తగా అర్థం చేసుకొని సకాలంలో కోర్సు లను పూర్తి చేయవలసి ఉంటుంది అని గమనించగలరు.
కొత్త ఆన్లైన్ దీక్షా విధానానికి అలవాటు పడండి, అందరూ సహకరించండి.
ధన్యవాదాలు.