• Home/
  • /
  • కొత్త, పాత జిల్లాల మధ్య ఉపాధ్యాయ పోస్టుల సర్దుబాటు * మొత్తం పోస్టులు.. వర్కింగ్ వేర్వేరుగా కేటాయింపు * రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 ప్రకారం పంపిణీ

కొత్త, పాత జిల్లాల మధ్య ఉపాధ్యాయ పోస్టుల సర్దుబాటు * మొత్తం పోస్టులు.. వర్కింగ్ వేర్వేరుగా కేటాయింపు * రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 ప్రకారం పంపిణీ

 *_కొత్త, పాత జిల్లాల మధ్య ఉపాధ్యాయ పోస్టుల సర్దుబాటు_*

 
• మొత్తం పోస్టులు.. వర్కింగ్ వేర్వేరుగా కేటాయింపు 
 
• రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 ప్రకారం పంపిణీ 
 
అమరావతి: 
 
ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 ప్రకారం స్థానిక కేడర్ల వారీగా పోస్టుల విభజన, కేడర్ స్ట్రెంగ్త్ను ఖరారు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 
 
నూతనంగా ఏర్పాటైన 26 జిల్లాలు, ఆరు జోన్లు, మల్టీ జోన్ల పరిధిలో ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పోస్టులను సర్దుబాటు చేసింది. 
 
రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, అన్ని రకాల పోస్టులు కలిపి మొత్తం 1,86,273 ఉండగా.. ప్రస్తుతం 1,61,369 మంది పని చేస్తున్నట్లు పేర్కొంది. ఉమ్మడి జిల్లాలోని బోధన, బోధనేతర సిబ్బందిని పాత, కొత్త జిల్లాలకు అవసరాల మేర సర్దుబాటు చేసింది. 
 
● అనంతపురం జిల్లాలోని 16,876 పోస్టుల్లో శ్రీసత్యసాయి జిల్లాకు 7,504 కేటాయించింది. పని చేస్తున్నవారు 14,822 మంది ఉండగా వీరిలో 6,688 మందిని శ్రీసత్యసాయికి పంపిణీ చేసింది. 
 
● చిత్తూరు జిల్లాలో 17,386 పోస్టులుండగా వీటిలో అన్నమయ్య జిల్లాకు 4,557, తిరుపతి జిల్లాకు 4,981 కేటాయించారు. 
 
● తూర్పుగోదావరి జిల్లాలోని 17,483 పోస్టులను అల్లూరి సీతారామరాజు జిల్లాకు 1,316, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లాకు 5,227, తూర్పుగోదావరికి 3,947, కాకినాడకు 6,989, ఎన్టీఆర్ జిల్లాకు నాలుగు పోస్టులు సర్దుబాటు చేశారు. 
 
● గుంటూరు జిల్లాలో 14,552 పోస్టులు ఉండగా.. బాపట్లకు 2,437, గుంటూరుకు 5,129, పల్నాడుకు 6,981, వైఎస్సార్ కడపకు ఐదు పంపిణీ చేశారు. 
 
● కృష్ణా జిల్లాలోని 12,799 పోస్టుల్లో ఏలూరుకు 2,095, కృష్ణాకు 5,928, ఎన్టీఆర్ జిల్లాకు 4,776 పంచారు. 
 
● కర్నూలులో 17,194 పోస్టులు ఉండగా వాటి నుంచి నంద్యాల జిల్లాకు 6,537 కేటాయించారు. 
 
● ప్రకాశంలోని 13,202 పోస్టుల్లో బాపట్లకు 1,524 పంచారు. 
 
● నెల్లూరు జిల్లాలోని 12,024 పోస్టుల్లో 2,415 పోస్టులను తిరుపతి జిల్లాకు కేటాయించారు. 
 
● శ్రీకాకుళం జిల్లాలో 11,842 పోస్టులు ఉండగా పార్వతీపురం మన్యానికి 903, శ్రీకాకుళానికి 9,857, విజయనగరం జిల్లాకు 1,082 పంపిణీ చేశారు. 
 
● విశాఖపట్నంలోని 11,188 పోస్టులను అల్లూరి సీతారామరాజు జిల్లాకు 3,013, అనకాపల్లి జిల్లాకు 5,657, విశాఖపట్నానికి 2,518 సర్దుబాటు చేశారు. 
 
● విజయనగరంలోని 9,347 పోస్టుల్లో పార్వతీపురం మన్యానికి 2,944 పంచారు. 
 
● పశ్చిమగోదావరి జిల్లాలో 13,058 పోస్టులు ఉండగా.. తూర్పుగోదావరికి 2226, ఏలూరుకు 4,937 పంపిణీ చేశారు. 
 
● కడపలో 11,121 పోస్టులు ఉండగా.. అన్నమయ్యకు 1,515, కర్నూలుకు 9, తిరుపతికి 1,142, వైఎస్సార్ కడపకు 8,455 పోస్టులు సర్దుబాటు చేశారు.