• Home/
  • /
  • PS HM లను భర్తీ చేసే విధానం (CSE) ద్వారా వెలువడిన క్లారిఫికేషన్ :

PS HM లను భర్తీ చేసే విధానం (CSE) ద్వారా వెలువడిన క్లారిఫికేషన్ :

 PS HM లను భర్తీ చేసే విధానం (CSE) ద్వారా వెలువడిన క్లారిఫికేషన్ : 

 
(1) మొదట జిల్లా లో ఎన్ని PSHM or LFLHM post లు (working + newly arised)ఉన్నాయో లెక్క తేల్చాలి. For Eg :300 ;
 
(2) తరువాత ఇప్పటికే జిల్లాలో పనిచేస్తున్న PSHM లకు ఆ పోస్టులన్నీ చూపించి బదిలీ చేస్తారు. For Eg :50 ;
 
(3) తరువాత మిగిలిన 250 post లలో SGT లకు ఎన్ని ప్రమోషన్ ద్వారా భర్తీ చేయాలో ఆ సంఖ్య ను for Eg 50 reserve చేస్తారు, కానీ place లు కాదు. 
 
(4.) తర్వాత అనగా working PSHM లకి బదిలీ లు జరగ్గా మిగిలిన vacancy లు అన్నింటినీ చూపిస్తూ అంటే 250  చూపిస్తూ , 200 మంది SA లకు వారికి వచ్చిన బదిలీపాయింట్ల సీనియారిటీ ప్రకారం  PSHM లు గా బదిలీ చేస్తారు. ఎందుకని ముందు SA లకే PSHM లుగా బదిలీ లు చేస్తారంటే, మామూలుగా అన్ని subject ల SA అందరికీ బదిలీలు జరిగిన తర్వాతే SGT లకు promotions ఇస్తారు కాబట్టి. 
 
(5) అయితే ఏ 200 మంది SA లకి PSHM లు గా అవకాశం ఇవ్వాలి? దీనికి జవాబుగా ముందు ప్రతీ subject wise proportionate గా ఆ 200 PSHM posts లను పంచుతారు. ఆ తర్వాత ప్రతీ subject నుండి willing అడుగుతారు. Willing ఇచ్చిన అన్ని subject ల SA లని, వారి బదిలీ పాయింట్ల సీనియారిటీ ఆధారంగా డిసెండింగ్ ఆర్డర్ లో list చేసి, counselling లో 250 place ల లో 200 కోరుకోమంటారు. 
 
(6) మిగిలిన 50 place(post )లు కి SGT లకు ప్రమోషన్ కౌన్సిలింగ్ చేస్తారు