*LEAP యాప్ – ఉపాధ్యాయుల హాజరు & సెలవుల నిర్వహణపై అత్యంత ముఖ్యమైన సూచనలు*
🚩ఉపాధ్యాయుల హాజరు నిర్వహణలో పలు లోపాలు గుర్తించబడిన నేపథ్యంలో, క్రింది సూచనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించవలసిందిగా ఆదేశించడమైనది.
🌻గమనించిన లోపాలు
✅ 1. కొంతమంది ఉపాధ్యాయులు నిర్దేశించిన సమయానికి హాజరు నమోదు చేయడం లేదు.
✅ 2. కొంతమంది Special Duty కోసం దరఖాస్తు చేస్తున్నప్పటికీ, నిబంధనల ప్రకారం హాజరు నమోదు చేయడం లేదు.
✅ 3. కొంతమంది ఉపాధ్యాయులు ముందుగానే సెలవు దరఖాస్తు చేయకుండా, MEO కార్యాలయం / DEO కార్యాలయం / VSK బృందాల నుండి ఫోన్ వచ్చిన తర్వాత మాత్రమే Leave కోసం దరఖాస్తు చేస్తున్నారు.
✅ 4. కొంతమంది DDOs, Leave మరియు Special Duty దరఖాస్తులను నిర్ణీత గడువులోగా ఆమోదించడం లేదు.
✅ 5. హైస్కూళ్లలో బోధన మరియు బోధనేతర సిబ్బంది హాజరును పర్యవేక్షించే బాధ్యత ప్రధానోపాధ్యాయులది. అయితే, కొంతమంది ప్రధానోపాధ్యాయులు ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించడం లేదని గుర్తించబడింది.
---
📌 బాధ్యతలు
🌻ప్రతి ఉపాధ్యాయుడు / ఉద్యోగి
నిర్ణీత సమయానికి హాజరు నమోదు చేయడం.
నిబంధనల ప్రకారం Leave / Special Duty కోసం ముందుగానే దరఖాస్తు చేయడం పూర్తిగా వ్యక్తిగత బాధ్యత.
🌻DDO
Leave మరియు Special Duty దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిశీలించి ఆమోదించడం బాధ్యత.
🌻మండల విద్యాశాఖ అధికారి (MEO)
మండలంలోని అన్ని పాఠశాలలు, హైస్కూళ్లతో సహా, హాజరు నమోదును MEO కార్యాలయం నుండి నిరంతరం పర్యవేక్షించి, నిబంధనలను కచ్చితంగా అమలు చేయించాలి.
---
📍ముఖ్య హెచ్చరిక
పై సూచనలను పాటించడంలో ఏ ఉపాధ్యాయుడు, ఉద్యోగి, ప్రధానోపాధ్యాయుడు లేదా DDO నిర్లక్ష్యం లేదా విధులపట్ల అలసత్వం ప్రదర్శించినట్లయితే, దానిని అత్యంత తీవ్రమైన అంశంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోబడతాయి.
— జిల్లా విద్యాశాఖ అధికారి (DEO)