*🍄మారిన గ్రాట్యుటీ రూల్స్*
*🔹ఎవరు అర్హులు?*
*♦️ గ్రాట్యుటీ అర్హతలో కొత్త కార్మిక చట్టాలతో కీలక మార్పులే చోటుచేసుకున్నాయి.*
*🔹కేవలం ఏడాదిపాటు సర్వీస్ కొనసాగితే ఉద్యోగులు గ్రాట్యుటీకి అర్హులే.*
*🔹 మునుపు ఇది కనీసం ఐదేండ్లుగా ఉన్నది.*
*🔹అయితే ఈ నిబంధన ఎప్పట్నుంచి వర్తిస్తుంది? అన్న సందిగ్ధం అంతటా నెలకొన్న నేపథ్యంలో కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ తమ ఎఫ్‌ఏక్యూ డాక్యుమెంట్లలో ఒకదానిలో స్పష్టత ఇచ్చింది.*
*🔹 గత ఏడాది నవంబర్ 21 నుంచి కొత్త గ్రాట్యుటీ రూల్స్ అమల్లోకి వస్తాయన్నది.*
*🔹దీంతో 2025 నవంబర్ 21న, ఆ తర్వాత కంపెనీల్లో చేరిన వర్కర్లకు ఈ నిబంధన వర్తిస్తుంది.*
*🔹అలాగే ప్రో రాటా ప్రాతిపదికన ఫిక్స్‌డ్-టర్మ్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ వర్కర్లే అర్హులు.*
*🔹 ఏడాది, రెండేండ్లకుగాను రాతపూర్వక ఒప్పందంపై ఉద్యోగంలో చేరేవారే ఫిక్స్‌డ్-టర్మ్ ఉద్యోగులు.*
*🔹 కాగా, శాశ్వత లేదా రెగ్యులర్ ఉద్యోగులకు ఎప్పట్లాగే ఐదేండ్లపాటు ఒకే సంస్థలో పనిచేస్తేనే ఆ కంపెనీ నుంచి గ్రాట్యుటీ ప్రయోజనం పొందడానికి వీలుంటుంది.*