SSC పరీక్షలు 16-03-2026 నుండి 01-04-2026 వరకు నిర్వహించబోతున్న సందర్భంగా విద్యార్థులకు సూచనలు :
📌SSC బోర్డు వారు ప్రకటించిన పరీక్షల కాలనిర్ణయ పట్టిక ప్రకారం పేపర్ కోడ్ తో సహ ఏ రోజు ఏ సబ్జెక్టు అన్న విషయం స్పష్టంగా తెలుసుకోవాలి .
📌అన్నీ పరీక్షలు ఉదయం 09-30 గంటలనుంచి మధ్యాహ్నం 12.45 వరకు నిర్వహించబడుతాయి . సమగ్రమైన వివరాలకు బోర్డు ప్రకటించిన టైమ్ టేబల్ చూడగలరు .
📌 పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష కేంద్రం వద్దకు ఉదయం 08.30 కల్లా చేరుకోవాలి .అభ్యర్థులను పరీక్ష కేంద్రం లోపలికి 08.30 AM నుంచి 09.30 AM మధ్య మాత్రమే అనుమతిస్తారు .
📌ఉదయం 09.30 తర్వాత ఎట్టి పరిష్టితుల్లోనూ అభ్యర్థులను పరీక్ష కేంద్రం లోపలికి అనుమతించరు.
📌అభ్యర్థులు తమ హాల్ టికెట్లలో తమ పేరు , పుట్టిన తేదీ ,ఫోటో ,సబ్జెక్టులు తదితర అంశాలను క్షుణ్ణంగా పరీక్షించుకోవాలి . ఏవైనా తప్పులుంటే పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారిని సంప్రదించాలి .
📌అభ్యర్థులు విధిగా తమ హాల్ టికెట్ ను వెంట తెచ్చుకోవాలి . లేనియెడల పరీక్షకు అనుమతింపబడరు .
📌 అభ్యర్థులు తమ వెంట మొబైల్ ఫోన్లను , ఇతర ఎలెక్ట్రానిక్ పరికరాలు అయిన లాప్ టాపులు,టాబ్లెట్,కెమెరా,ఇయర్ ఫోన్స్,స్మార్ట్ వాచ్ , బ్లూ టూత్ పరికరాలు తీసుకురాకూడదు . ఒకవేళ అలాంటి వాటితో అభ్యర్థులు పరీక్ష కేంద్రంలో దొరికినట్లయితే నియమావళి ననుసరించి వారిపై తగు చర్యలు తీసుకో బడును.
📌అభ్యర్థులకు 24 పేజీల ఆన్సర్ బుక్ లెట్ ఇవ్వబడుతుంది . సైన్స్ పరీక్ష రోజు మాత్రం 12 పేజీల ఆన్సర్ బుక్ లెట్లు రెండు ఇవ్వబడుతాయి . సమాధానాలన్నీ 24/12 పేజీలకు లోబడే రాయాలి . సమాధాన పత్రంలోని విషయ నాణ్యతకు మార్కులు ఇవ్వబడతాయి కానీ సమాధాన నిడివికి కాదు .
📌అత్యవసర పరిస్థితులలో తప్ప అభ్యర్థులు పరీక్ష కేంద్రాన్ని వీడడానికి అనుమతింపబడరు . ఖచ్చితంగా 09.30 AM నుంచి 12.45 PM వరకు పరీక్ష కేంద్రంలో గడపాలి .
📌12.45 PM లోపల అభ్యర్థులు తమ వెంట ప్రశ్నా పత్రాన్ని పరీక్షాకేంద్రం బయటకు తీసుకు వెళ్లకూడదు .
📌 ఏ అభ్యర్థైనా పరీక్ష కేంద్రంలో మాల్ ప్రాక్టీసు కింద దొరికినట్లైయితే GO.Rt.8729SE) Dt.16-05-1992 ప్రకారం తదుపరి పరీక్షలకు హాజరు కావడానికి వీలు లేదు .
📌అభ్యర్థులు 24 పేజీల ఆన్సర్ బుక్ లెట్ తో పాటు OMR బార్ కోడ్ షీట్ తీసుకున్న వెంటనే OMR షీట్ పై ముద్రించబడిన పేరు,ఫోటో , రోల్ నంబరు మొదలగు వివరాలను పరిశీలించుకున్న తరవాతే పరీక్ష రాయడం మొదలుపెట్టాలి . ఒకవేళ ఏవైనా తప్పులు వున్నట్లు తెలిస్తే వెంటనే ఇన్విజిలేటర్ ని సంప్రదించాలి .
📌అభ్యర్థులు 24/ 12 పేజీల ఆన్సర్ బుక్ లెట్లో గానీ , మ్యాప్ మీద గాని , గ్రాఫ్ పేపర్ మీద గాని తమ పేరు ,రోల్ నంబరు లేదా ఇతర వివరాలేవీ రాయకూడదు . గ్రాఫ్ మీద లేదా మ్యాప్ మీద కేవలం తమ 24 పేజీల ఆన్సర్ బుక్ లెట్ సీరియల్ నంబరు మాత్రమే వేయాలి .
📌అభ్యర్థులు తమకు కేటాయించబడిన పరీక్ష కేంద్రం నందు మాత్రమే పరీక్షలకు హాజరు అవ్వాలి . ఇతర కేంద్రాలలో పరీక్షలకు అనుమతింపబడరు .
📌పరీక్ష కేంద్రంలో గుంపులుగా తిరగకూడదు . వేసవి కాలం కాబట్టి కాటన్ దుస్తులు ధరించాలి పైగా బిగుతుగా వున్న దుస్తులు కాకుండా లూజు గా వున్న దుస్తులు ధరించడం మంచిది.
📌అభ్యర్థులు ఎవరి వస్తువులు (పెన్సిల్ ,పెన్ ,వాటర్ బాటిల్ మరియు ఇతర సామగ్రి )వారే తెచ్చుకోవాలి . ఒకరి వస్తువులు మరొకరు వాడుకోవటం నిషిద్ధం .
📌అభ్యర్థులు ఉదయం పూట విధిగా టిఫిన్ తిని, వాటర్ బాటిల్ తో పరీక్ష కేంద్రానికి రావాలి . పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఆహార పదార్థాలు తెచ్చుకోరాదు.
📌 అభ్యర్థులు ఎవరైనా జ్వరం / దగ్గు/ జలుబు / నీరసం / కోవిడ్ లక్షణాలతో బాధ పడుతూ వుంటే , వెంటనే ఇన్విజీలేటర్ గారికి తెలియ పరచాలి .
📌అభ్యర్థుల వ్యక్తిగత వస్తువులను పరీక్షాకేంద్రం లోపలికి అనుమతించరు .
📌పరీక్షలకు సంబంధించిన ఎలాంటి పుకార్లను / నిరాధార వార్తలను నమ్మకూడదు మరియు ప్రచారం చెందించ రాదు .
శుభాకాంక్షలు మరియు ఆశీస్సులతో..
💐💐💐