• Home/
  • /
  • SSC పరీక్షల ఫార్వార్డింగ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులందరికీ తెలియజేయునది.🔥🔥

SSC పరీక్షల ఫార్వార్డింగ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులందరికీ తెలియజేయునది.🔥🔥

 *🔥🔥అత్యంత ముఖ్యమైన సూచన – SSC పరీక్షల ఫార్వార్డింగ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులందరికీ తెలియజేయునది.🔥🔥*

 
SSC ఫార్వార్డింగ్ పాఠశాలల HMs అందరూ క్రింది వెబ్‌సైట్ హోమ్‌పేజీలో సూచించిన విధంగా వెంటనే తమ పాఠశాల లాగిన్ పాస్‌వర్డ్‌ను మార్చుకోవలసిందిగా ఆదేశించడమైనది.
 
1. దయచేసి మీ పాఠశాలకు సంబంధించిన 5 అంకెల SSC పాఠశాల కోడ్‌ను (5-Digit SSC School Code) User ID స్థానంలో నమోదు చేయాలి.
 
2. డిఫాల్ట్ పాస్‌వర్డ్‌గా SSC పాఠశాల కోడ్‌కు చివరగా @26 జోడించి నమోదు చేయాలి. ఉదాహరణకు, మీ పాఠశాల కోడ్ 12345 అయితే, డిఫాల్ట్ పాస్‌వర్డ్ 12345@26 అవుతుంది.
 
3. లాగిన్ అయిన వెంటనే, నిర్దేశించిన పాస్‌వర్డ్ నిబంధనల ప్రకారం డిఫాల్ట్ పాస్‌వర్డ్‌ను తప్పనిసరిగా మార్చుకోవాలి.
 
4. UDISE పోర్టల్‌లో Exam Details సమర్పించిన తరువాత, BSE పోర్టల్‌లోకి లాగిన్ కావడానికి ముందు 24 గంటలు వేచి ఉండాలి.
 
5. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న User Manual ను తప్పనిసరిగా పరిశీలించాలి.
 
 
వెబ్‌సైట్‌లో పొందుపరిచిన సూచనలను (Instructions to HM) పూర్తిగా చదవాలి.
 
User Manual ను క్షుణ్ణంగా పరిశీలించాలి.
 
పాఠశాల లాగిన్‌లోని డిఫాల్ట్ పాస్‌వర్డ్‌ను వెంటనే మార్చుకోవాలి.
 
తదుపరి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించే ముందు అన్ని సూచనలను జాగ్రత్తగా పాటించాలి.
 
గమనిక: ఒకసారి దరఖాస్తు సమర్పించిన తరువాత ఎటువంటి మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉండదు. కావున ప్రతి ఒక్కరూ ఈ సూచనలను అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి, వెంటనే పాస్‌వర్డ్ మార్చుకొని User Manual ను తప్పనిసరిగా చదవగలరు.
 
– Deputy Educational Officer, Vijayawada Division