*AP*
మార్చి 2027 లో జరగనున్న SSC పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల చేసిన ఏపి ప్రభుత్వ పరీక్షల విభాగం. రెగ్యులర్ మరియు గతంలో ఫెయిల్ అయిన విద్యార్థుల వివరాలను ముందుగా UDISE+ లాగిన్‌లో సరిచూసుకొని, నిర్దేశిత గడువులోగా అధికారిక వెబ్‌సైట్ (
https://bse.ap.gov.in ) ద్వారా పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
*ఫీజు చెల్లింపు తేదీలు..:*
▪️ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా 11-11-2026 నుండి 25-11-2026 వరకు
▪️ ₹.50/- ఆలస్య రుసుముతో: 26-11-2026 నుండి 02-12-2026 వరకు
▪️ ₹.200/- ఆలస్య రుసుముతో: 03-12-2026 నుండి 09-12-2026 వరకు
▪️₹.500/- ఆలస్య రుసుముతో: 10-12-2026 నుండి 15-12-2026 వరకు
*పరీక్ష ఫీజు వివరాలు..:*
▪️ రెగ్యులర్ విద్యార్థులకు (అన్ని సబ్జెక్టులు / 3 కంటే ఎక్కువ) : ₹.125/-
▪️ 3 సబ్జెక్టుల వరకు : ₹.110/-
▪️ ఒకేషనల్ విద్యార్థులకు : అదనంగా ₹.60/-
▪️ వయోపరిమితి సడలింపు రుసుము (Underage students): ₹.300/-
*ముఖ్యమైన గమనిక..:*
▪️ ఫీజు చెల్లింపులు కేవలం స్కూల్ లాగిన్ (https://bse.ap.gov.in) ద్వారా మాత్రమే చేయాలి. CFMS లేదా బ్యాంక్ చలానాలు అంగీకరించబడవు.
▪️ మాన్యువల్ నామినల్ రోల్స్ (MNRs) సమర్పించాల్సిన అవసరం లేదు.
👍🏻