*సర్పంచ్‌గా పోటీ చేయడానికి నామినేషన్ వేసేటప్పుడు ఇవన్నీ రెడీగా ఉంచుకోవాలి. ఒక్కటి మిస్ అయినా నామినేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది.*
*1. అర్హతలు:*
- వయసు 21 ఏళ్లు నిండి ఉండాలి
- ఆ గ్రామ పంచాయతీ ఓటర్ లిస్టులో మీ పేరు ఉండాలి
- ప్రభుత్వ ఉద్యోగి అయితే ఉండకూడదు
*2. కావాల్సిన ప్రధాన పత్రాలు:*
- *నామినేషన్ ఫారం (Form-III)* - రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర తీసుకోవాలి, అభ్యర్థి + ప్రపోజర్ సంతకాలతో
- *ఓటర్ కార్డు (EPIC) జిరాక్స్* - మీది + ప్రపోజర్ ది
- *ఆధార్ కార్డు జిరాక్స్*
- *ఓటర్ లిస్ట్ వివరాలు* - మీ పార్ట్ నంబర్, సీరియల్ నంబర్, ప్రపోజర్ ది కూడా
- *పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు* - 4-6 కాపీలు
- *వయసు ధృవీకరణ పత్రం* - 10th మెమో / బర్త్ సర్టిఫికెట్
- *కుల ధృవీకరణ పత్రం* - రిజర్వ్డ్ సీటు అయితే తప్పనిసరి. జనరల్ సీటులో పోటీ చేసినా SC/ST/BC అయితే డిపాజిట్ తగ్గింపు కోసం కావాలి
- *నో డ్యూస్ సర్టిఫికెట్* - పంచాయతీ కార్యదర్శి నుండి పంచాయతీకి ఎలాంటి బకాయిలు లేవని
- *అఫిడవిట్ / ప్రమాణ పత్రం* - నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, చదువు, పిల్లల వివరాలతో, ఇద్దరు సాక్షుల సంతకాలతో
- *డిపాజిట్ రసీదు* - సర్పంచ్‌కు జనరల్ అభ్యర్థులకు ₹3,000, SC/ST/BC అభ్యర్థులకు ₹1,500
*3. ప్రపోజర్ గురించి:*
- *ప్రపోజర్ అదే గ్రామ పంచాయతీలో ఓటరుగా ఉండాలి*
- *నామినేషన్‌ను అభ్యర్థి స్వయంగా లేదా ప్రపోజర్ ద్వారానే ఇవ్వాలి*
*ముఖ్య సూచన:* *ఒకటి నుంచి నాలుగు సెట్ల వరకు నామినేషన్లు వేసుకోవచ్చు ఒక సెట్లో పొరపాటు వచ్చినా ఇంకోటి ఉంటుంది*