TET రాయనవసరం లేని వారు
1.DSC 2012,2014,2018,2025 SGT ఉపాద్యాయులు పేపర్ 1 రాయనవస్రం లేదు.. అయితే భవిష్యత్తులో SA పదోన్నతి కోసం పేపర్ 2 రాయాలి(గతం లో క్వాలిఫై కాకపోతే)
2.DSC 2012,2014,2018,2025 ద్వారా నియమితులైన SA లు..వీరికి టెట్ అవసరమే వుండదు..వీరు తదుపరి పదోన్నతి Gr 2 HM కాబట్టి పోస్టుకు Tet అవసరం లేదు.
3.31/08/2030 లోపు పదవి విరమణ చేసే SGT లు..అయితే SA గా పదోన్నతి పొందాలి అంటే పేపర్ 2 క్వాలిఫై కావాలి.
4.31/08/2030 లోపు పదవి విరమణ చేసే SA లు కూడా TET రాయనవసరం లేదు.
5.ఒక వేళ ప్రస్తుతం SGT గా కొనసాగుతూ రెండేళ్ల లోపు PS HM పదోన్నతి కచ్చితంగా వస్తుంది అనే నమ్మకం ఉన్న SGT లు..ఎందుకంటే ప్రస్తుతం ఉన్న హోదా లో కొనసాగాలి అంటే రెండేళ్ల లోపు TET పేపర్ 1 క్వాలిఫై కావాలి..ఆలోపు PS HM పదోన్నతి వస్తె ఆ హోదా లో కొనసాగడానికి TET అవసరం ఉండదు
6.అదేవిధంగా రెండేళ్ల లోపు SA నుంచి Gr 2 HM పదోన్నతి కచ్చితంగా వస్తుంది అనే నమ్మకం ఉన్న కూడా SA లు.