*ఏపీలోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు.. గడువు పొడిగింపు*
ఏపీ రాష్ట్రంలోని IIIT లలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే గడువును అధికారులు రేపటి వరకు పొడిగించారు. నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్లలో మొత్తం 4,400 సీట్లు ఉండగా, ఈడబ్ల్యూఎస్ (EWS) కోటా కింద మరో 10% అదనపు సీట్లను భర్తీ చేయనున్నారు. వచ్చే నెల రెండో వారంలో ఫలితాలు విడుదల చేసి, మూడు నాలుగు వారాల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.