G.O. No-45, dated: 20/4/2026 ప్రకారం 27 నెలల లోపు ఉపాధ్యాయులను కొత్త జిల్లాలకు సర్దుబాటు చేస్తారు
పోస్టులను జిల్లా స్థాయి, జోనల్ స్థాయి, మల్టీ జోనల్ పోస్టులుగా 3 విభాగాలుగా విభజన చేస్తారు
SGT పోస్టులు SA పోస్టులు Gr-2 HM పోస్ట్లు జిల్లా స్థాయి పరిధిలోనే ఉంటాయి
రోస్టర్ పాయింట్లు ప్రకారం BC లకు, SCలకు, STలకు,PHC ల వారిగా పోస్ట్లు కేటాయిస్తారు
ఉమ్మడి జిల్లా అనేది లోకల్ పరిధిలోనే ఉంటుంది.లోకల్లో 95% నాన్ లోకల్ 5% పోస్టులని విభజన చేస్తారు
పోస్టుల విభజనకు సంబంధించిన ఫైలు GAD కి వెళ్ళినది
ఉమ్మడి జిల్లా ఆధారంగానే సబ్జెక్టు వైజ్ గా సీనియార్టీని చూస్తారు
ప్రతి టీచర్ కి ఆప్షన్ ఫారం ఇస్తారు .ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారం option -1,2,3... పెట్టాలి
సీనియార్టీ ర్యాంక్ ఆధారంగానే ఉపాధ్యాయుల సర్దుబాటు జరుగుతుంది
ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్న ఉపాధ్యాయులకు ,
అలాగే 70% పైన PHC ఉన్న ఉపాధ్యాయులకు,
మానసిక వైకల్యం ఉన్న చిల్డ్రన్స్ యొక్క తల్లిదండ్రులు ఐన ఉపాధ్యాయులకు,
కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన టీచర్స్ కు,
బ్రెయిన్ ప్రాబ్లం ఉన్నవారికి,
కిడ్నీ మార్పిడి జరిగిన టీచర్స్ కు,
న్యూరో సర్జరీ జరిగిన టీచర్స్ కు టాప్ ప్రయారిటీ ఇస్తారు
స్పౌజును పరిగణనలోకి తీసుకోరు
మొదట జిల్లాలకు అలాట్ అయినట్లు ఆర్డర్లు ఇస్తారు. ఆ తరువాత అలాటైన జిల్లాలో ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా ప్లేసులు కేటాయిస్తారు.
ఒక నెల తరువాత spouse ఉన్నటువంటి వారికి మ్యూచువల్ బదిలీలకు అవకాశం కల్పిస్తారు.
ప్రస్తుతం PSHM గా పనిచేస్తున్న SA లందరికి వారి సబ్జెక్టు క్యాడర్ సీనియారిటీ ప్రకారమే సర్దుబాటు జరుగుతుంది. వారిని PSHM పోస్టులలో కొనసాగనివ్వరు
ఈ సర్దుబాటు ప్రక్రియ అంతా *తెలంగాణ* రాష్ట్రంలో జరిగిన ప్రకారమే జరుగుతుంది
రోగస్తులైన తల్లిదండ్రులు ఉన్న టీచర్స్ కి ఈసారి ప్రయారిటీ లేదు
దాదాపు ఈ విద్యా సంవత్సరంలో ప్రమోషన్లు,ఉపాధ్యాయ బదిలీలు జరగవు.జిల్లాల వారీగా సర్దుబాటు మాత్రమే జరుగుతుంది.
610 జీవో ప్రకారం వచ్చిన ఉపాధ్యాయులకు సీనియారిటీ అలాగే కొనసాగుతుంది.
అంతర్ జిల్లా బదిలీలలో వచ్చిన వారికి సీనియార్టీ లో ఆ జిల్లాలో చేరిన నాటి నుంచి మాత్రమే లెక్కిస్తారు
సుప్రీంకోర్టు టెట్ పై వేసిన పిల్ లను అన్నిటిని డిస్మిస్ చేసినది కనుక 2028 నాటికి అందరూ టెట్ క్వాలిఫై కావాల్సినదే
ప్రస్తుతం మన ముందు ఉన్న తక్షణ కర్తవ్యం జూన్ నెలలో మన పాఠశాల రోలును బాగా పెంచుకోవటమే