*జిల్లాల్లోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులందరికీ తెలియజేయునది ఏమనగా,*
* జూలై నెల 17 లేదా 18 తేదీల్లో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహించబడుతుంది.
* ఈ కార్యక్రమంలో మీరు డిస్ప్లే లో పెట్టవలసిన అతి ముఖ్యమైన సామాగ్రి FLN TLM.
* అనగా జాదూయి పిటారా కిట్లు, ప్రింట్ రిచ్ మెటీరియల్, ఫ్లాష్ కార్డులు, లైబ్రరీ పుస్తకాలు, ప్లే మెటీరియల్, ఫర్నిచర్ మొదలగునవి.
* ఇందులో చిన్న జాదూ పిటార్ కిట్లు మరియు లైబ్రరీ పుస్తకాలు ఏప్రిల్ నెలాఖరులో మండల స్టాక్ పాయింట్లకు పంపించడం జరిగింది.
* ఇప్పటికే చాలామంది మండల విద్యాశాఖ అధికారులు వాటిని పాఠశాలలకు పంపించారు.
* పెద్ద జాదుయి పిటారా కిట్లు ఎక్కువ మంది పిల్లలు ఉన్న పాఠశాలకు మాత్రమే రాగా చిన్న జాదుయి పిటారా కిట్లు ప్రతి పాఠశాలకు ప్రతి పదిమంది లేదా 15 మంది విద్యార్థులకు వచ్చే విధంగా కేటాయించడం జరిగింది.
* లైబ్రరీ పుస్తకాలు కూడా ప్రతి పాఠశాలకు వచ్చే విధంగా కేటాయించడం జరిగింది.
* కావున ప్రతి ప్రాథమిక పాఠశాలలో జాదూయి పిటారా అయితే పెద్దది లేదా చిన్నది తప్పనిసరిగా ఉండవలెను.
* అలాగే పెద్ద జాదూయి పిటారా లేని పాఠశాలలో చిన్న జాదూ యి పిఠారా తోపాటు ప్రింట్ రిచ్ మెటీరియల్ తప్పనిసరిగా ఉండవలెను.
* ఈ విషయం ప్రతి ప్రధానోపాధ్యాయుడు నిర్ధారించుకుని మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో డిస్ప్లే చేయుటకు సిద్ధంగా ఉండవలెను.
* ఒకవేళ మీకు ఇవి అందకపోయి ఉంటే మీ మండల విద్యాశాఖ అధికారిని సంప్రదించవలెను.
* ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి ప్రాథమిక పాఠశాలలో FLN TLM ప్రదర్శన జరగాలి అనేది SPD, సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ వారి ఉత్తర్వులు.