• Home/
  • /
  • ఆంధ్ర ప్రదేశ్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ Andhra Pradesh Revised Pension Rules, 1980 రూల్ 50, 50(d)(2) నిబంధనల ప్రకారం Enhanced ఫ్యామిలీ పెన్షన్ (EFP)/ నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ ఎలా లెక్కిస్తారు ?

ఆంధ్ర ప్రదేశ్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ Andhra Pradesh Revised Pension Rules, 1980 రూల్ 50, 50(d)(2) నిబంధనల ప్రకారం Enhanced ఫ్యామిలీ పెన్షన్ (EFP)/ నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ ఎలా లెక్కిస్తారు ?

 👏కన్వర్షన్ ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్ అయిన తర్వాత ఫ్యామిలీ పెన్షన్ ఎలా ఫిక్స్ చేస్తారు ఎంత వస్తుంది అని ఒక మిత్రుడు ప్రశ్నించడం జరిగింది దానిపై ఈ క్రింది వివరణ చూడండి....

 
🌹ఆంధ్ర ప్రదేశ్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్  Andhra Pradesh Revised Pension Rules, 1980 రూల్ 50, 50(d)(2) నిబంధనల ప్రకారం  Enhanced ఫ్యామిలీ పెన్షన్ (EFP)/  నార్మల్ ఫ్యామిలీ పెన్షన్  ఎలా లెక్కిస్తారు ?
 
🌻ఫ్యామిలీ పెన్షన్ అనేది ప్రభుత్వ ఉద్యోగి సేవలో ఉన్నప్పుడు లేదా రిటైర్మెంట్ తర్వాత మరణించినప్పుడు అతని కుటుంబానికి ఇవ్వబడే పింఛను. 
 
🌹ఫ్యామిలీ పెన్షన్ ఎలా లెక్కిస్తారు?
 
🌹రూల్స్ ప్రకారం రెండు రేట్లు ఉన్నాయి. అవి.
👉Enhanced family pension 
👉Normal family pension.
 
1)Enhanced ఫ్యామిలీ పెన్షన్-   ఉద్యోగి సేవలో 7 ఏళ్లు కనీసం పనిచేసిన తర్వాత మరణిస్తే లేదా రిటైర్మెంట్ తర్వాత మరణించినా కుటుంబం పొందే Enhanced Family Pension = 50% of last drawn emoluments..
 
🌹ఇది 10వ పిఆర్సి ప్రకారం మరణం తర్వాత 7 సంవత్సరాల పాటు  లేదా ఉద్యోగికి 65 ఏళ్లకు చేరేవరకు మాత్రమే లభిస్తుంది.
 
🌹రిటైర్మెంట్ తర్వాత మరణించిన సందర్భాల్లో 7 సంవత్సరాల పాటు మాత్రమే లేదా ఉద్యోగి 65 ఏళ్లకు చేరేవరకు మాత్రమే లభిస్తుంది.
 
🌹Normal ఫ్యామిలీ పెన్షన్- 
Enhanced సమయం ముగిసిన తర్వాత లేదా Enhanced కి అర్హత లేని సందర్భాల్లో అమలవుతుంది.
 
👉 Normal Family Pension = 30% of last drawn emoluments. ఇది ఉద్యోగి చివరి జీతం/ఎమోల్యూమెంట్స్ ఆధారంగా లెక్కించ బడుతుంది.
లెక్కింపు చేసిన తర్వాత వచ్చిన విలువను సమీప రూపాయికి రౌండ్ ఆఫ్ చేస్తారు. 
 
🌻సర్వీస్ పెన్షనర్ పెన్షన్ పొందుతూ   రిటైర్ అయిన ఏడు సంవత్సరాల లోపు లేదా 65 సంవత్సరాల వయసు లోపు మరణిస్తే Enhanced  ఫ్యామిలీ పెన్షన్ సర్వీస్ పెన్షనర్ పొందే పూర్తి పెన్షన్ ఫ్యామిలీ పెన్షనర్ కు పెన్షన్ గా  లభిస్తుంది. 
ఉదాహరణకు ఒక
ఉద్యోగి చివరి జీతం  ₹80,930 అయినట్లయితే:
 
👉Enhanced family pension (50%): ₹80930X50/100 = 40465./-  అంటే సర్వీస్ పెన్షనర్ పొందుతున్న బేసిక్ పెన్షన్ . 
 
👉దీనిపై అమలులో ఉన్న డిఆర్ మరియు మెడికల్ అలవెన్స్ చెల్లిస్తారు.
 
👏నోట్-  ఒక ఉద్యోగి సర్వీస్ లో ఉంటూ లేదా రిటైర్ ఐ సర్వీస్  పెన్షన్ పొందుతూ  మరణిస్తే  10 సంవత్సరాల లోపు లేదా 67 సంవత్సరాల వయసు వరకు Enhanced  ఫ్యామిలీ పెన్షన్ సౌకర్యాన్ని 2022 పి ఆర్ సి లో పొందుపరిచారు.
 
🌹2017 లో రిటైరైన సర్వీస్ పెన్షనర్ పెన్షన్ పొందుతూ   రిటైర్ అయిన ఏడు సంవత్సరాల అనంతరం లేదా 65 సంవత్సరాల వయసు దాటిన తర్వాత కాలంలో సర్వీస్ పెన్షనర్ మరణిస్తే వారి spouse కు నార్మల్ పెన్షన్ లభిస్తుంది.
 
👉దానిని ఈ క్రింది విధంగా కాలిక్యులేట్ చేస్తారు .
 
🌹సర్వీస్ పెన్షనర్ రిటైర్మెంట్ నాటికి పొందే బేసిక్ పే X 30% 
 
👉ఉదాహరణ 
ఉద్యోగి చివరి జీతం  ₹80,930 అయినట్లయితే
 
👉Normal family pension (30%): ₹80930X30/100= 24279/-
 
👉ఈ ఉద్యోగి 2017లో రిటైర్ అయినందున తర్వాత పిఆర్సి లలో ఇవ్వబడిన ఫిట్మెంట్ ఈ నార్మల్ బేసిక్ పెన్షన్ కు కలిపి బేసిక్ ఫిక్స్ చేస్తారు. 
 
👉2022లో ఫిట్మెంట్ 23% 
కావున 24279X23% = 5584
24279+5584=29863/- బేసిక్ పెన్షన్ గా ఫిక్స్ చేయబడుతుంది .
 
👉దీనిపై ప్రస్తుతం ఉన్న 37.31% డి.ఆర్+ 500/-మెడికల్ అలవెన్స్ చెల్లించబడుతుంది.
 
🌹 ఫ్యామిలీ పెన్షనర్ వయసు 70 సంవత్సరాలు దాటితే అడిషనల్ క్వాంటం కూడా వర్తిస్తుంది.
కె.కె.వి. నాయుడు,  అమలాపురం