• Home/
  • /
  • టీచర్ల బదిలీలు - GO MS 22 తేదీ 20.05.2025 ప్రకారం ======= పాయింట్ల కేటాయింపు విధానం:

టీచర్ల బదిలీలు - GO MS 22 తేదీ 20.05.2025 ప్రకారం ======= పాయింట్ల కేటాయింపు విధానం:

 టీచర్ల బదిలీలు - GO MS 22 తేదీ 20.05.2025 ప్రకారం

   =======    
పాయింట్ల కేటాయింపు విధానం:
 
* కేటగిరీ-1 (పట్టణ ప్రాంతాలు): సంవత్సరానికి 1 పాయింట్
* కేటగిరీ-2 (మునిసిపల్ ప్రాంతాలు): సంవత్సరానికి 2 పాయింట్లు
* కేటగిరీ-3 (గ్రామీణ ప్రాంతాలు): సంవత్సరానికి 3 పాయింట్లు
* కేటగిరీ-4 (మారుమూల ప్రాంతాలు): సంవత్సరానికి 5 పాయింట్లు
* పని చేసిన మొత్తం సర్వీస్ కాలానికి: సంవత్సరానికి 0.5 పాయింట్లు
* భార్యభర్తలు ప్రభుత్వ ఉద్యోగులైతే: 5 పాయింట్లు (ఒకరికి మాత్రమే వర్తిస్తుంది)
* అవివాహిత మహిళా ఉపాధ్యాయులకు: 5 పాయింట్లు
* 40%-55% శారీరక వైకల్యం లేదా 60%-70% వినికిడి లోపం ఉన్నవారికి: 5 పాయింట్లు
* 40% దృష్టిలోపం లేదా 56%-59% శారీరక వైకల్యం ఉన్నవారికి: 7 పాయింట్లు
* ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు/కార్యదర్శులకు: 5 పాయింట్లు
* విడాకులు తీసుకుని మళ్లీ పెళ్లి చేసుకోని మహిళా టీచర్లు, సైనిక విభాగాల్లో పని చేసి టీచర్లుగా ఉన్నవారికి: 5 పాయింట్లు
* స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్‌ను 2 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు: 5 పాయింట్లు
* పునర్విభజనలో తప్పనిసరిగా బదిలీ అయ్యే ఉపాధ్యాయులకు: 5 పాయింట్లు.
 
 ప్రాధాన్యత (Preferential Category):
 
* వందశాతం దృష్టిలోపం లేదా 80% పైగా శారీరక వైకల్యం ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత
* 75% దృష్టిలోపం, 70%-79% శారీరక వైకల్యం లేదా 70% పైగా వినికిడి లోపం ఉన్నవారికి రెండో ప్రాధాన్యత
* పునర్వివాహం చేసుకొని వితంతువులు
* క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, బోనోటీసీ, కిడ్నీ మార్పిడి, డయాలసిస్, స్పైనల్ సర్జరీ చేసుకున్న వారు
* జీవిత భాగస్వామి లేదా పిల్లలు జుననైల్ డయాబెటిస్, తలసేమియా, హీమోఫిలియా, కండరాల క్షీణతతో బాధపడుతున్నవారికి వైద్య చికిత్స పొందుతున్నవారు.