జేఈఈ మెయిన్-2026 పరీక్షల షెడ్యూల్ విడుదల JEE-MAIN-2026 TENTATIVE SCHEDULE
జేఈఈ మెయిన్-2026 పరీక్షల షెడ్యూల్ విడుదల
జేఈఈ మెయిన్ పరీక్షకు ఎన్టీఏ రెండు సెషన్లలో నిర్వహించే ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్ష(CBT)కు సంబంధించి ఆదివారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. జనవరి 21 నుంచి 30 మధ్య తేదీల్లో జేఈఈ మెయిన్ (సెషన్ 1), ఏప్రిల్ 1 నుంచి 10వ తేదీల మధ్య సెషన్ -2 పరీక్షలు నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే, ఈ పరీక్షలు జరిగే కచ్చితమైన తేదీలను తర్వాత ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. జేఈఈ మెయిన్ సెషన్ -1 పరీక్షకు ఈ నెల నుంచే ఆన్లైన్ దరఖాస్తులు వెబ్సైట్లో అందుబాటులోకి వస్తాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పేర్కొంది.